Friday, November 5, 2010

Friday, November 5, 2010

మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ..

దీపావళి ..,
నువ్వంటే నాకిష్టం ,
ఎందుకో తెలుసా ,
అమావాస్యను కూడా వెన్నెలంత వెలుగులతో నింపేస్తావు ,
చిమ్మ చీకట్లలో  కూడా చిరునవ్వులని చిందిస్తావు,


ఇరులని చిదిమి ,
ఇల్లంతా ఇంపైన దివ్వెలతో అలంకరించేస్తావు.






నా మిత్రులు , శ్రేయోభిలాషులు అయిన మీ అందరికీ

హృదయ పూర్వక దీపావళి శుభాకాంక్షలు ..

Monday, November 1, 2010

దీపావళి గ్రీటింగ్ E - Cards



హాయ్ ఫ్రెండ్స్,

ఈ ఏడాది దీపావళి పండుగ కు countdown start అయ్యింది. మిత్రులకు, బందువులకు మరియు శ్రేయోభిలాషులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పే సమయం కూడా మొదలవ్వబోతోంది. మరి ఇక ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా మనవారందరికి e - mails ద్వారా మరియు social networking sites ద్వారా Diwali Greeting E - Cards పంపించి దీపావళి శుభాకాంక్షలు తెలియజేద్దాం పదండి.     


Image and video hosting by TinyPic

Image and video hosting by TinyPic


తిరుపతి

Saturday, October 30, 2010

పద్దెనిమిది కోట్ల హృదయాల చప్పుడు!

చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా ..గతమెంతో ఘనకీర్తి కలవోడా !

తెలుగు లలితకళాతోరణానికి రాజీవ్ పేరును జోడిస్తూ రాష్త్ర ప్రభుత్వం జారీచెసిన ఉత్తర్వులపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో ఆ ప్రతిపాదనను తెచ్చిన టి.సుబ్బరామి రెడ్డి తన ప్రయత్నాన్ని ఎట్టకేలకు విరమించుకోక తప్పలేదు. తెలుగు లలితకళాతోరణాన్ని యధాతధంగా ఉంచుతామని సుబ్బరామిరెడ్డి 30 నవంబరు 2010 వ తేదీ మధ్యాహ్నం టి.వి.9 చానెల్ ద్వారా ప్రకటించారు. తెలుగు జాతిలో వెల్లువెత్తిన ఆత్మాభిమానం తాకిడికి తట్టుకోలేకే ఈ దుష్ట యత్నాన్ని విరమించుకున్నారని భావించవచ్చు. " తెలుగు " అనే భావనే ఒక జాతినీ, భాషనూ సూచించే ఒక గొప్ప నామవాచకమైనప్పుడు తెలుగు కు ముందు మరొక పేరు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందనేది జాతిజనుల ప్రశ్న! బడి పిల్లలు తెలుగులో మాట్లాడినందుకు "నేనెప్పుడూ తెలుగులో మాట్లాడను" అనే ఆంగ్లంలో రాసిన అట్ట బోర్డులను  పసిపిల్లల మెడల్లో వేలాడదీసి శిక్షించిన సంఘటన జరిగిన సందర్భంలో చేష్టలుడిగి  చూసిన ప్రభుత్వం తెలుగు లలిత కళాతోరణం విషయంలో కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన దుర్గతిని మాత్రం ప్రజలు గమనిస్తున్నారని విస్మరించకూడదు. సుబ్బరామిరెడ్డి వెనుకడుగు వేసిన తర్వాతనైనా ప్రభుత్వం తాను జారీ చేసిన ఉత్తర్వులను తక్షణం విరమించుకుంటే బాగుంటుంది.    తెలుగు లలితకళాతోరణాన్ని 33 ఏళ్ళ లీజుకు తీసుకుని వ్యాపారం చేసుకుందామని ప్రయత్నించి దానికి పబ్లిక్, ప్రయివేట్, పార్ట్ నర్ షిప్ (పిపిపి) అనే అందమైన పేరును తగిలించారు.. వాట్ యాన్ అయిడియా సర్జీ! ..జనం అంటున్నారు..మాట్లాడ్డానికే కాదు..జాతి స్ఫూర్తికీ  " తెలుగు " అవసరమని..!       

Friday, October 29, 2010

kavita by Savira Snigdha

సరదా సరదా

నవ్వులు  –  పువ్వులు
చిన్ని :—  ఏరా  నువ్వు  మొత్తం   నీళ్లతో  తడిచే  ఉన్నావు! మరి  అమ్మ  ఎందుకు  స్నానం  చేయలేదని  నీపై   అరుస్తోందేమిటి?
బాబి :—  సబ్బు  తడపటం  మర్చిపోయాను!

చిన్ని ;—  బాబీ  ఎందుకలా  పరిగెత్తుకూంటూ  వెళుతున్నావు?
బాబి ;—   నాన్న   త్వరగా  కొట్తుకి వెళ్ళి  రమ్మన్నాడు.
చిన్ని ;—-  ఏం  కొనడనికి ?
బాబి ;—-  అడుగుతూ  కూర్చుంటే  ఆలస్యమవుతుందని,  త్వరగా  వెళ్లి  రావటానికి  పరిగెడుతున్నా.
మీరు  చెప్పండి
1)  కాళ్ళూ  చేతులు  లేవు,  మొడెం  ఉంది.  తల లేదు  మెడ ఉంది.  ఏమిటది?


2) ఓ చోట  మూడు  తెల్ల  ఆవులు,  రెండు  నల్ల  ఆవులు,  ఒక  ఎర్ర  ఆవు  ఉన్నాయి.  వీటల్లో  ఎన్ని  ఆవులు  నీ రంగు  నా రంగు  ఒకటే  అని  చెప్పగల

సరదా సరదా

Click to get cool Animations for your MySpace profile


నవ్వులు  –  పువ్వులు
:)     చిన్ని;-–    బాబి నువ్వెందుకురా ఆకాశంలో మెరుపు మెరసినప్పుడలా నవ్వుతూ ఉంటావు?
బాబి ;—-    అది నన్ను పోటో తీస్తుంది, దాంట్లో అందంగా రావాలని.
:)   చిన్ని ;–   బాబీ కాకతీయులపాలన ఎక్కడనుండి మొదలైయ్యిందో చెప్పు.
బాబి;--   సాంఘీకశాస్త్రం పుస్తకంలో 35 పేజీలో మొదలై   46 లో ముగిసిందక్కా.

:)   బాబీ ఓ రోజు వాళ్ళ స్కూలు కి ఫోన్ చేసి ఇలా చెప్పాడు. బాబీకి  కి చాలా జ్వరం వచ్చింది, ఈ రోజు బడికిరాడు”.  అవతల టీచర్  అయ్యో అవునా మీరెవరు మాట్లాడుతున్నారు అన్నాడు. అందుకు బాబీ నేను  మా అమ్మను మాట్లాడుతున్నాను టీచర్  అన్నాడు.

:) చిన్ని;— నాకు మన సైన్స్ టీచర్ అంటే ఇష్టం!  బాబీ  మనస్కూల్లో అందరికంటే ఎవరు నీకిష్టం?
బాబి;– నాకు మన స్కూల్  బెల్లు కొట్టే  పుల్లయ్య  ఇష్టం.
మీరు చెప్పండి
పార్క్ లో చిన్ని ఆడుకుంటూ ఉంది.   ఇంక చాలు ఇంటికొచ్చేమని అక్కడికి వాళ్ళ మామయ్య వచ్చాడు, “ఉహూ ఇంకోగంట ఆడుకుంటాను” అంది చిన్ని. ఐతే నా ప్రశ్నకు సమాధన మిస్తే నిన్ని ఇంకోగంట ఆడుకోనిస్తాను, లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోదాం అన్నాడు మామయ్య. అది ఆయన వయస్సు కనిపెట్టటానికై ఆతను ఇచ్చిన క్లూ.

ఇదిగో ఆ ప్రశ్న మీరు సమాధానం చెప్పగరేమో చూడండి –>
నాల్గేళ్ళ తరువాత నా వయస్సుకు నాల్గురెట్లు, అయిదేళ్ళతరువాత వయసుకు ఐదురెట్లు కలిపితే ప్రస్తుతం నా వయసుకు పదిరెట్లు ఉంటుంది. మరి నాకు ఎన్నేళ్ళో చెప్పాలి.

మరి చిన్ని కి మీరు సాయం చేయండి.
చిన్ని పుస్తకాల అలమార సర్దుకుంటోంది, దాంట్లో ఓ పాత పర్సు కనిపించింది.అందులో ఆరు నోట్లున్నాయి. వాటి మొత్తం విలువ 63 రూపాయలు. దాంట్లో రూపాయి నోట్లు లేవు, చిల్లర పైసలూ లేవు. ఆ ఆరు నోట్లు ఏవి? అంటే ఏవేవి కలిపితే మొత్తం 63 వస్తుంది?.

పులి నక్క కథ

పూర్వం ఒక అడవిలో ఒక  నక్క  నివసించేది.  అది పూర్వజన్మలో చేసిన పాపాల  కారణంగా  అలా నక్క లా  పుట్టింది.  ఈ  జన్మలో అటువంటి పాపాలు చేయకుడదని నిర్ణయించుకుంది. అది ఆ అడవిలోనే్ మంచినక్క.  మాంసం ముట్టుకోకుండా కేవలం ఆకులు అలములతో  శాకాహారంతోనే కాలం గడుపుతూ ఉండేది.
ఆ అడవిలోని  పులి ఆ నక్క గురించి  విని  దానితో  స్నేహం చేయాలనుకుంది. నక్క వద్దకు వెళ్ళి  స్నేహితులుగా  ఉందామని  చెప్పి  తనతో  రమ్మని  అడిగింది.  పులి కౄరమృగం  దానితో స్నేహం ఇష్టంలేక  నక్క అంగీకరించలేదు.  ’నీ స్నేహం  నాకు  ముఖ్యం. నీ పద్దతి ప్రకారమే నేనూ  నడచుకుంటా”  అంటూ పులి  బ్రతిమిలాడింది.  నక్క లాగే తనూ నియమంగా ఉంటానని  పులి  చెప్పడంతో  నక్క  ఆ పులితో కలిసి  జీవించడానికి  ఒప్పుకుంది.
పులికి నక్క చెప్పేమాటలు  చాలా నచ్చేవి. అది  చెప్పినట్టుగానే  నడచుకునేది.  వాటి స్నేహం,  నక్క చెప్పినట్లుగా  పులి  వినడం  అదంతా   పులితో  కలిసి వుండే   మిగతా జంతువులకి  నచ్చలేదు. ఎలాగైనా   నక్కను  పులిని విడగొట్టాలనుకున్నాయి.     ఓ పధకం ప్రకారం పులి తెచ్చుకుని  దాచుకున్న  ఆహారాన్నంతా  నక్కకు  తెలియకుండా  నక్క వద్ద  పెట్టి,  పులి వద్దకు  వెళ్ళి  నక్క   ఆహారాన్ని  దొంగిలించింది  అని  చెప్పాయి.
పులికి నక్క మంచితనం  తెలుసు. ఐనా కూడా  నక్కని   చంపివేయమని  చెప్పేస్తుంది. అది  తెలుసుకున్న నక్క  పులిని  విడిచి వెళ్ళిపోయింది.  చెప్పుడు మాటల వలన  పులి  మంచి స్నేహాన్ని కోల్పోయింది.
నీతి ;  చెడ్డవారితో స్నేహం ప్రమాదకరం.