Monday, January 31, 2011


Monday, January 31, 2011

త్రిష కోరిక తీర్చిన సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌

 '' మీరు కనుక అంగీకరిస్తే ఎన్నాళ్లుగానో నా మనసులో ఉన్న కోరికను నెరవేర్చుకుంటూ'' అని ఫ్లయిట్‌ ఎక్కగానే తెల్లని కాగితంలో ముత్యాలను తలపించే దస్తూరీతో పైలట్‌కి రాసి పంపిస్తుంటారట త్రిష. ' కాకిపిట్‌' లో కూర్చుని విమానాన్ని పైలట్‌ ఎలా నడుపుతున్నారో చూడాలన్న త్రిష కోరిక. ఇది చిన్న కోరికేం కాదు. అయినా సరే ఎలగైనా తీర్చుకోవాలి త్రిష పంతం పట్టారు. విమానిం ఎక్కిన ప్రతిసారీ తన ప్రొపైల్‌ను ఎయిర్‌ హేస్టస్‌కి ఇచ్చి పైలట్‌కి అందజేయమని కోరుతుంటారట త్రిష.
గత కొన్ని సంవత్సరాలు ఈ వ్యవహారం సాగుతోంది. దానికి కారణం తమతో పాటు కాక్‌పిట్‌లో ప్రయాణీకులు ఉంటే అధికారులకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందన్న భయమే. ఇటీవల తన కోరిక నెరవేరిందని సమాచారం. ఎప్పటిలానే త్రిష విమానం ఎక్కి తన సీట్లో కూర్చోగానే పైలట్‌కు ప్రొపైల్‌ పంపించారట. ఈ సారి కూడ ' నో ' అనే సమాధానమే వస్తుందని ఫిక్స్‌ అయ్యారట. కానీ పైలట్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో త్రిష ఆశ్చర్యపోయారట. కాక్‌పిట్‌లో కూర్చుని విమానాన్ని పైలట్‌ ఎలా కంట్రోల్‌ చేస్తున్నారో కాసేపు తిలకించి త్రిష ఆనందపడ్డారట. తన కోరిక నెరవేరినందుకు శ్రేయోభిషుల దగ్గర ఆ ఆనందాన్ని కూడా పంచుకున్నారట. ఇంతకీ త్రిష కోరిక తీర్చినది మన ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ కాదు .. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్.....

చిరంజీవికి జనమంటే లోకువ!?

    చిరంజీవి తన బామ్మరిది అల్లు అరవింద్ దుష్టమంత్రాంగం మైకంలో పడి తను మంచి లీడర్గా ఎదిగే అవకాశాలను తనే చేజేతులా పోగొట్టుకుంటున్నాడు. రాజకీయాలను కూడా ఓ పక్కా సినిమా వ్యవహారంగా చూడటమంటే తనంతటతనే ఒక నాయకుడిగా ఎదిగే మార్గాన్ని మూసేసుకుంటున్నాడన్నమాట! మొన్నటి తన ఎన్నికల వైఫల్యానికి సరైన కారణాలు అన్వేషించకుండా, అవి దిద్దుకునే ప్రయత్నాలు చేయకుండా చిరంజీవి మరో తప్పు చేస్తున్నారు!
     సినిమాల నుంచి రాజకీయాల్లోకి రావడానికి ముందు ఎంటీయార్ చాలా ఆలోచించారు. తనకున్న అధ్బుతమైన ఫాలోయింగ్ ను మాత్రమే నమ్ముకోలేదు ఆయన. అప్పుడు భ్రష్టుపట్టిపోయిన కాంగ్రెస్ రాజకీయాలతో జనం విసిగిపోయి ఉన్నారు. గ్యాప్ పూడ్చటంలో ప్రతిపక్షాలు కూడా విఫలమయ్యాయి. అందుకని ఆ స్పేస్ తనకు బాగా ఉపయోగపడింది. మొత్తం ఆయన కమ్యూనిటీయే కాకుండా మార్పు కోరిన జనమంతా బ్రహ్మరథం పట్టారు. కేవలం వీటినే పట్టించుకోకుండా ఆయన రెండు రూపాయల బియ్యం వంటి హామీలను, జాతి ఆత్మగౌరవం వంటి కదిలించగలిగిన నినాదాలనూ ఆయన నమ్ముకున్నారు. అన్నింటికీ మించి ఆయన పదునైన ప్రసంగాలు, కాంగ్రెస్ పైన ఎక్కుపెట్టిన తీవ్ర విమర్శలు కూడా పనికొచ్చాయి. తను టికెట్లు ఇచ్చినప్పుడు ఎక్కువగా రాజకీయంగా వెనుకబడిన వర్గాలు, చదువుకున్నవారు, కొత్తవారికి ప్రాధాన్యం ఇచ్చారు. "నిష్కళంక" అనే ముద్ర కోసం ప్రయతించారు. మరి చిరంజీవి విషయంలో ఏం జరిగింది? 
     తను రాజకీయాల్లో చేరే విషయంలో విపరీతమైన హైప్ క్రియేటైంది. ఎప్పుడూ అంత హైప్ క్రియేట్ కావడం సినిమాల్లో ఓపెనింగ్ కలెక్షన్లను పెంచుతుంది కానీ ఎక్కువరోజులు సినిమా నడవటానికి ఉపయోగపడదనేది చిరంజీవికి తెలియంది కాదు. ఒకవైపు పాతుకుపోయిన వైఎస్, మరోవైపు కేడర్ బలమున్న చంద్ర బాబు ఉన్న స్థితిలో చిరంజీవి తనకు పెద్ద స్పేస్ క్రియేట్ కావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందని గమనిచలేకపోయారు. ముందే చెప్పినట్టు హైప్ కారణంగా సభలకు జనం విపరీతంగా వచ్చారు కానీ దాన్ని వోట్ల రూపంలోకి మార్చుకునే విషయంలో అన్నీ తప్పుటడుగులే పడ్డాయి. దీనికి అరవింద్ ప్రధానకారకుడు. గెలిచేవారికి టికెట్లకు ఇచ్చి ముందు ఎన్నికల పరీక్షలో గెలవడానికి ట్రై చేయాల్సింది పోయి అమ్మకానికి పెట్టారు. ఎవడిని నిలబెట్టినా గెలుస్తారనే భ్రమో, డబ్బు వచ్చినప్పుడు ఎందుకు వద్దనాలనే సినిమా బుద్దో కానీ అక్కడే పార్టీ సగం భ్రష్టుపట్టింది. పసలేని ప్రసంగాలు, ప్రభావం చూపించలేని నినాదాలతో చిరంజీవి తన అభిమానులనే నిరాశపరిచాడు. నిజానికి తనకొచ్చిన వోట్లు, సీట్లు కూడా ఎక్కువే అని రాజకీయ విశ్లేషకుల విస్మయం. పోనీ తరువాతైనా పార్టీని నిలబెట్టడానికి ట్రై చేశాడా అంటే అదీ కరువైంది. సబ్జెక్ట్ లేకపోవడం, పార్టికి ఏ విషయంలోనూ ఓ వైఖరి లేకపోవడం, ఎవరినీ నమ్మలేకపోవడం, తనకే సీరియస్ నెస్ లేకపోవడం, అనుభవలేమి కారణంగా తెలంగాణాపై యూటర్న్ తీసుకోవడం వంటి అనేకానేక లోపాలతో ఒక్కొక్కరే వదిలిపోయారు. రాజకీయ నిష్క్రియాపరత్వం ఎంతటి పెద్ద పార్టీనైనా (విపక్షంలో ఉన్నప్పుడు) దెబ్బ తీస్తుంది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టికి పీఆర్పీ అవసరం వచ్చిందో అరవింద్ మళ్లీ క్రియాశీలమయ్యారు. డబ్బు వచ్చే చాన్స్, పదవి దక్కే చాన్స్ కళ్లముందు డాన్స్ చేస్తూ కనిపించాయి. ఇక్కడ తను సొంతంగా విధాన నిర్ణయాలు తీసుకునే సత్తా లేని చిరంజీవి మళ్లీ తప్పుటడుగులు వేస్తున్నారు. 
* ప్రస్తుతం రాష్ట్రంలో కొంత పొలిటికల్ స్పేస్ కనిపిస్తోంది. తనకు నిజంగా రాజకీయ భవిష్యత్తుపై ఆలోచన ఉంటే తల లోపాలు సరిదిద్దుకుని విస్తృతంగా జనంలోకి వెళ్లాల్సి ఉంది. కానీ ఎంతసేపూ ఇప్పుడున్న సంఖ్యాబలంతోనే ఎంత "లబ్ది" పొందాలనే ఆశ తప్ప ఒంటరిగా బలపడాలనే ఆలోచన కనిపించడం లేదు.
* ఒకవేళ విలీనానికి అంగీకరిస్తే ఇప్పుడున్న ఎమ్మేల్యేలతోపాటు మరికొన్ని సీట్లు తను అడుగుతాడు. అది కాంగ్రెస్, పీఆర్పీ రెండింటికీ నష్టమే. పరోక్షంగా జగన్ తలపై పాలు పోయడమే.
* కేవలం వ్యూహాత్మక మద్దతుకే పరిమితమై కేబినెట్లో చేరినా కాంగ్రెస్ పైన కనిపించే వ్యతిరేకత ప్రభావాన్ని కూడా పీఆర్పీ భరించాల్సి ఉంటుంది.
* ఇప్పుడు దక్కబోయే దానిపైనే అరవింద్ ఆశ. తనకు రాజ్యసభ అందులో ఒకటి. ఒకసారి కాంగ్రెస్ పార్టికి మద్దతు ఇచ్చినా, విలీనం జరిగినా తరువాత ఆ పార్టీ ఎలా ఆడుకుంటుందో చిరంజీవికి తెలుసుకోలేకపోతున్నాడు.
* పక్కా సమైక్యవాదితో పొత్తు, మద్దతు, విలీనం ద్వారా కాంగ్రెస్ తెలంగాణాలో మరింత బలహీనపడటం ఖాయం.
ఈ వైఫల్యాల మాటెలా ఉన్నా కాంగ్రెస్ తో చేతులు కలపడాన్ని చిరంజీవి నైతికంగా ఎలా సమర్థించుకోగలరు? ఆయనకు వేసిన 69 లక్షల వోట్లు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వేసినవే కదా? "మార్పు కోసం" పేరిట రాజకీయం చేసిన తను ప్రజలకు ఏమని సమాధానం చెబుతారు...? ఊరూరా కాంగ్రెస్, టీడీపీ శ్రేణులతో పోరాడిన ఆయన అభిమానులకు ఇది శరాఘాతం కాదా...? "పిచ్చి" ఆవేశంతో ఎన్నికల ప్రసంగాలు చేసిన కొమురం పులి ఇప్పుడు ఎటు పోయాడు...? చిర్నజీవి సీఎం కావలని రాజకీయాల్లో చేరినా... ప్రజలు మాత్రం ఇప్పుడే తనకు సీఎం అయ్యే అర్హత లేదని, కానీ ఇంకా కొంత కష్టపడాలనీ తీర్పు చెప్పి కొన్ని వోట్లు వేశారు. అవి తక్కువ వోట్లేమీ కావు. ఇప్పుడు తను పార్టీని నడిపించలేక, ఏదో ఇలా కాంగ్రెస్ లో చేరి కథ నడిపించేద్దామని ప్రయత్నించడం ఆయన రాజకీయ అనుభవరాహిత్యాన్నే బయటపెడుతోంది. అంతేకాదు ఆయన ప్రస్తుత వైఖరి తనకు వోట్లేసిన వారిని ఒకరకంగా అవమానించడమే అవుతుంది. రాజకీయకోణంలో ఇది కరెక్టో కాదోననే చర్చ ఎలా ఉన్నా నైతికత కోణంలో మాత్రం అసమంజసం!

Saturday, January 29, 2011

కామ సూత్రాల్లో చెప్పని కొన్ని ముఖ్య విషయాలు.

సెక్స్ భార్యతో జరిగితే అది 'డ్యూటీ'.
ప్రేమికురాలితో జరిగితే అది ' ఆర్ట్'
కన్యతో జరిగితే అది ' ఎడ్యుకేషన్'
వేశ్యతో జరిగితే అది ' వ్యాపార లావాదేవి'
విడాకులు తీసుకున్న ఆమెతో జరిగితే అది 'సామాజిక సేవ'
భర్తహీనతో జరిగితే అది ' విరాళం'

ఈ వేళలో నీవు ఏంచేస్తూంటావో..అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూనేను..

గులాబి సినిమాలో గుండెకు హత్తుకునే పాట ఇది..ఇద్దరు నిజమైన స్నేహితులు ప్రేమికులు దూరంగా విడిపోయినప్పుడు...వారి మదిలో మెదిలే బావాలు ఇలాగే ఉంటాయి ఇది ప్రతి ఓక్కరికి జీవితంలో తారసపడే ఘటనే తాలూకా వాస్తవ రూపమే ఈ పాట... ఈ వేళలో నీవు ఏంచేస్తూంటావో..అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూనేను..నీ పరిచయంతోనే నాగుండె జారిపోయింది..నీ వైపు వెల్లిన నామనసు నీ నీడగా మారి నావద్దకు రానంటుంది..నాకు దూరంగా ఉంటూనే ఏమాయ చేస్తున్నావు...గతంలో కల్సి తిరిగిన స్నేహితులు గుర్తుకు వచ్చినప్పుడు .. ఆ సమయం గుర్తుకు వచ్చి ఈ సమయంలో ఏంచేస్తున్నావు అని భాధగా అప్పటిజ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకునే పాట..ఈ పాటలో ప్రతి పదం లో నిజంఉంది..పాట లోని మ్యూజిక్ వింటుంటే గండె వేగం పెరుగుతుంది అలోచనలు మనమాట వినకుండా మనల్ని వీడి ఎక్కడికో వెళ్ళిపోతాయి..సైలెంటు మ్యూజిక్ ఈ పాటకు హైలెట్..నీవు మదిలో గుర్తుకు రాగానే అస్సలు నాకు నిదరేరాదు అన్నీ నీతలపులే కాలాన్ని ఎలాగడపాలి నీజ్ఞాపకాలకు దూరంగా..రాత్రుల్లే కాదు పగలు కూడా కాసేపు పడుకోనీయవు నా ద్యానం అంటా నీమీదనే ఎటు వైపు చూసినా నీవే గుర్తుకు వస్తున్నావు....నీవు కాక నాకు ఏమి గుర్తుకు రావడంలేదు అనే చరనాలు నిజంగా మనసుకు మత్తునిస్తాయి..నిజంగా నిజాయితీ గా ప్రేమించే వాళ్ళకోసమే ఈ పాట ..ప్రేమను ప్రేమగా ప్రేమించలేని వారు...ప్రేమపేరుతో మోసపోయిన వారూ ఆ పాతజ్ఞాపకాలు గుర్తుకు వచ్చినప్పుడు ఈ పాట మనసులోని గాయాన్నీ కెలుకుతుంది కచ్చితంగా.......ప్రేమించానంటూ మోసం చేసిన వారు నిజంగా పాతజ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటారా..నిజంగా ప్రేమించాను అని చెప్పి నాది నిజ మైన ప్రేమ నాప్రేమలో రెస్పెక్టు ఉంది అని చెప్పి మాటతప్పిన వారికి నిజంగా ఇలాంటి పాతజ్ఞాపకాలు గుర్తుంటాయా ప్రేమిస్తున్నప్పుడు ప్రతిక్షనం నీవే గుర్తుకు వస్తున్నావని చెప్పి ఎలామోసం చేయగలుగుతారు..ప్రేమలో ఎంతమందికి అవకాశంఉంటుంది..ఎంతమందిని నిజాయితీగా ప్రేమిస్తారు..అప్పుడు ప్రేమతో అన్నమాటలు ఎప్పుడైనా గుర్తుకు వస్తాయా? ఏమో?..నిజంగా స్వచ్చంగా ప్రేమించేవారు ఒక్కరిని ప్రేమిస్తారు ఆరాధిస్తారు వారు దగ్గర ఉన్నా దూరం అయినా తన కు ఇష్టం అయినవారి గురించి చెబితే ఎలానమ్ముతారో అర్దం కాదు..నమ్మకం లేకుండా గతంలో ఎందుకు ప్రేమించారు...అలా తనకు ఇష్ట ఉన్నవారి మీద లేనిపోనియి ఎవ్వరైనా చెబితే నిర్దారించుకోకుండా దూరం అవుతారు వారి ప్రేమలో నిజాయితీ లేనట్టేకదా..? ఒక్కోసారి అనిపిస్తుంది అంత ఇష్టం ఒక్కసారిగా ఎలా మారిపోతుందో...అందుకే ఇలాంటి పాటలు పాత జ్ఞాపకాలని కెలికి భాదను పెంచుతాయి..అంతే అదా అలాంటి పాతజ్ఞాపకాలు గుర్తుకు వచ్చిపుడు భాదపడటంతప్ప ఏమి చేయలేం..

Friday, January 14, 2011

హీరోయిన్స్ ఇద్దరూ తమ పరిధులు మేరకు బాగానే చూపారు...అదే నటించారు:Mirapakaya review

-సూర్య ప్రకాష్ జోశ్యుల
సంస్థ: ఎల్లో ఫ్లవర్స్‌
నటీనటులు: రవితేజ, రిచా గంగోపాధ్యాయ, దీక్ష సేథ్‌, ప్రకాష్ ‌రాజ్‌, కోట శ్రీనివాసరావు,
సునీల్‌, చంద్రమోహన్‌, అలీ, సురేఖావాణి, అజయ్‌, సుధ తదితరులు.
సినిమాటోగ్రఫీ: సి.రామ్ ప్రసాద్
సంగీతం: తమన్
కూర్పు: గౌతమ్ రాజు
సంగీతం: తమన్‌
నిర్మాత: రమేష్‌ పుప్పాల
కధ, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్

గతంలో "షాక్" ఇచ్చిన డైరక్టర్ తో రవితేజ మరోసారి సాహసం చేస్తున్నాడంటే...గ్యారెంటీగా స్క్రిప్టు అధ్బుతంగా ఉండి ఉంటుంది అని ఎక్సపెక్ట్ చేయటం సహజం. అయితే అది అత్యాసే నని, రవితేజ ఎప్పటిలాగే స్క్రిప్టు ఎలాగున్నా తనదైన టిపికల్ మ్యానరిజంస్ తో, అల్లరి చేష్టలతో సినిమాను లాగించేయచ్చు అని నమ్మి ఈ చిత్రం చేసినట్లు స్పష్టమవుతుంది. షారూఖ్ ఖాన్ హిందీ చిత్రం "మైహూనా" ను ప్రక్కన పెట్టుకుని కథ అల్లుకున్నట్లున్న ఈ చిత్రం ద్వితీయార్ధం ప్రారంభం నుండి మెల్లిగా డ్రాప్ అయిపోతూ..పోతూ...క్లైమాక్స్ కి వచ్చేసరికి పూర్తిగా జారిపోయింది. హరీష్ శంకర్...మాటల రచయితగా పంచ్ డైలాగులు వేసి నవ్వించాడు కానీ కథకుడుగా రాణించలేకపోయాడు. అలాంటి స్ధితిలో సినిమాను చివరిదాకా భరించగలిగాము అంటే అది రవితేజ ఎనర్జీతో ఇచ్చిన కిక్కే అని చెప్పాలి.

ఇంటిలిజెన్స్ ఆఫీసర్ అయిన రిషి(రవితేజ) ఉరఫ్ మిరపకాయ ఓ మిషన్ నిమిత్తం డిల్లీ నుంచి హైదరాబాద్ వస్తాడు. ఆ మిషన్ లో భాగంగా ఓ కాలేజీలో హిందీ లెక్చరర్ గా జాయిన్ అవుతాడు. ఖాళీగా ఉండటమెందుకన్నట్లు అక్కడి స్టూడెంట్ వినమ్ర(రిచా గంగోపద్యాయ్)తో ప్రేమలో పడి పాటలు పాడుతుంటాడు. ప్రేమ ఓ కొలిక్కి వచ్చిందనగా అతనికి అప్పచెప్పిన మిషన్ పూర్తి వివరాలు తెలుస్తాయి. వాటి ప్రకారం ఆ కాలేజీ కొత్త స్టూడెంట్ వైశాలి(దీక్షా సేధ్) ని రిషి...ప్రేమలో పడేయాలని ఆ మిషన్ లక్ష్యం అని తెలుస్తుంది. అప్పుడు రిషి తన ప్రేయసి ఎదురుగా వైశాలిని ఎలా ప్రేమలో దించాడు...ఇంతకీ వైశాలిని ప్రేమలో పడేయటానికి ఇంటిలిజెన్స్ కు ఉన్న కారణం ఏమిటి అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్రేమ కోసం ఒకరిని, ప్రొఫెషన్ కోసం మరొకరిని ప్రేమలో పడేయటమే పాయింటు రవితేజకు నచ్చి ఈ చిత్రం ఓకే చేసి ఉండవచ్చు. కానీ నిజంగా ఓ అమ్మాయిని ప్రేమలో దింపి మాఫియాడాన్ అయిన అతని తండ్రిని పట్టుకోవాలనే వింత ఆలోచన ప్రపంచంలో ఏ ఇంటిలిజెన్స్ డిపార్టమెంట్ అయినా చేస్తుందా...చేయాలనుకున్నా ప్రేమలో దింపటమెందుకు...దొరికిన అమ్మాయిని ఏ కిడ్నాపో మరొకటో చేసి ఆమె తండ్రిని పట్టుకోవచ్చుకదా అని ఈ చిత్రం చూస్తున్నంతసేపూ తొలుస్తుంది. అలాగే విలన్(ప్రకాష్ రాజ్) పాత్ర ఎక్కడో క్లైమాక్స్ దాకా కథలోకి రాదు. అతన్నిహీరో చంపితే బాగుండును, అతను దుర్మార్గుడు కదా అనే ఆలోచన మనకు పొరపాటున కూడా కలగదు. దాంతో హీరో అతన్ని చంపుతూంటే హీరో ఎందుకిలా చేస్తున్నాడు అనే డౌట్ వస్తుంది. దానికితోడు తన కూతురుని ప్రేమ పేరుతో ట్రాప్ చేస్తున్నారనే విషయం ఆ ఇంటర్నేషనల్ డాన్ కి క్లైమాక్స్ దాకా కూడా తెలియదు. దాంతో అతను హీరోని పట్టించుకోడు. హీరో కూడా క్లైమాక్స్ దాకా అతని జోలికి వెళ్లడు. దాంతో అస్సలు సినిమా ఎటుపోతుందో చూసేవారికి అర్దం కాదు.

మొదటే చెప్పుకున్నట్లు ఈ చిత్రంలో డైలాగులు బావున్నాయి. అయితే డైలాగులతోనే సినిమా మొత్తం నడిపేయటం నచ్చదు. అలాగే దర్శకుడుగా షాక్ నాటి షార్ప్ నెస్ ఎందుకనో చిత్రంలో మిస్సైందనిపిస్తుంది. హీరోయిన్స్ ఇద్దరూ తమ పరిధులు మేరకు బాగానే చూపారు...అదే నటించారు. కోట, ప్రకాష్ రాజ్ ఇద్దరూ కొన్ని వందల సార్లుచేసిన పాత్రే చూస్తున్నాం అనిపిస్తుంది. పాటల్లో రెండు బాగున్నాయి..ధియోటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. కెమెరా, ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే.

ఏదైమైనా ఇది రవితేజ సినిమా ఇలాగే ఉంటుంది అని ఫిక్సై వెళితే ఫరవాలేదనిపిస్తుంది. కాస్సేపు నవ్వుకుందామని వెళ్తే అల్లరి నరేష్ సినిమాలా ఎంటర్టైన్ చేస్తుంది.అ దే మంచి మాస్ మసాలా సినిమా చూద్దామనుకుంటే మాత్రం నిరాశపరుస్తుంది. మిరపకాయ్...ఘాటు ఉంటుందని మాత్రం ఎక్సపెక్ట్ చేయద్దు.

పరమ వీర చెత్త

“యంగ్ ఇండియా” వంటి డిజాస్టర్ సినిమా తీసి ఈ మధ్య కాలంలో తన సత్తా ఏంటో ప్రపంచానికి తెలిపిన దాసరి తన తదుపరి చిత్రానికి బాలకృష్ణను హీరోగా ఎంపికచేసుకున్నాడనగానే అంతటా అంచనాలు కన్నా అనుమాలు ఎక్కువ మొదలయ్యాయి. అయితే సింహా ఇచ్చిన కిక్ తో బాలయ్య చాలా జాగ్రత్తగా ఉంటాడని, దాసరి కూడా తన 150 చిత్రం కదా అని చాలా జాగ్రత్తలు తీసుకుంటాడని ఎవరకి వారే సర్దిచెప్పుకుని రిలీజ్ కోసం ఎదురుచూసారు. అయితే వారి ఆశలు నిరాశలే అయ్యాయి. అభిమానులు సైతం ఫరవాలేదు అనలేని స్ధితిలో చిత్రం తెరకెక్కింది. సైనికాధికారిగా, సినీ హీరోగా, రావణాబ్రహ్మగా, కొమురం భీమ్ గా రకరకాల గెటప్స్ లో బాలకృష్ణ కనపించి అలరించినా, అదంతా బాలకృష్ణ ఇన్నిగెటప్స్ వేసి ఒప్పించగలడు, ఇంత బాగా చేయగలడు అని చెప్పటానకి ప్రత్యేకంగా పనిగట్టుకుని తయారు చేసిన ప్రచార చిత్రంలా తయారైంది. కథా లోపమే కాక దశ, దిశ లేని దర్శకత్వం పాపం కూడా సినిమాను, బాలకృష్ణ క(ఇ)ష్టపడి చేసిన నటనాకౌశలాన్ని దారుణంగా దెబ్బతీసింది.
ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించే స్టార్ హీరో చక్రధర్(బాలకృష్ణ). అతన్ని అభిమానిస్తూ వెంటబడే (షీలా) అతనికి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తూంటుంది. అయితే అతని తల్లి( జయసుధ  )కి అలాంటివి గిట్టవు. ఆవిడకి తన కొడుకు పెద్ద మిలిట్రీ మేజర్ అయ్యి, దేశానికి సేవ చేయాలనే జీవితాశయం. ఈ స్ధితిలో చక్రధర్ కు కొందరు ఆర్మీ ఆఫీసర్స్ పరిచయమై తమ దగ్గరో అధ్బుతమైన కథ ఉందని చెప్తారు. కథ నచ్చితే ప్రీగా చేస్తానని మాట ఇచ్చిన చక్రధర్ కి ఆ కథని జితేంద్ర(మురళి మోహన్)అనే మిలిట్రీ ఆఫీసర్ నోటిగుండా వినటానకి రెడీ అవుతాడు. ఆ కథ ఆర్మీలో సిన్సియర్ ఆఫీసర్ మేజర్ జయసింహ(బాలకృష్ణ)కి చెందింది. కథ వింటున్న చక్రధర్ అందులో లీనమై తనను తాను జయసింహాగా ఊహించుకుంటాడు. ఆ తర్వాత నిజంగానే ఆ కథ జరిగిందని తెలుసుకుంటాడు. విన్న ఆ కథ ప్రకారం కొందరు కుట్రదారులు (సినిమా ఈ రేంజి పాత వాసనలుతో ఉంటుంది) వల్ల నష్టపోయి, దేశద్రోహిగా మిగిలిన జయసింహకు న్యాయం చేయాలనుకుంటాడు. అందుకోసం సినిమా నటుడు, జయసింహ పోలికలతో ఉన్న చక్రధర్ ఏం చేసాడు. ఈ కథకీ పరమవీరచక్ర బిరుదుకీ సంభందం ఏమిటీ అన్నది మిగతా సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
బాలకృష్ణ చేత ఈ చిత్రం బొబ్బిలిపులికి సీక్వెల్ కాదు…రీమేక్ అంతకన్నా కాదు అని ప్రత్యేకంగా ఇంటర్వూల్లో చెప్పించిన దాసరి ఈ చిత్రాన్ని బొబ్బిలిపులి సీన్ తోనే మొదలెడతారు. అలాగే మేజర్ జయసింహ కథంతా విన్న హీరో చక్రధర్ కి ఊహించని విధంగా ఏదో ట్విస్ట్ వస్తుందని ఎన్నో సినిమాలు చూసిన సగటు ప్రేక్షకుడు ఎదురుస్తాడు. అయితే వారి ఊహకు అందనిరీతిలో అంతసీనెందుకు అన్నట్లుగా రొటీన్ గానే కథనం సా…గు..తూంటుంది. కొన్ని సార్లు చాలా మందికి విజయేంద్రవర్మ చిత్రం కూడా గుర్తుకు వచ్చి ఆ ప్లాపుకి కనెక్టు అయిపోయారు.
సినిమా ప్రారంభమైన చాలా సేపటికిగాని కథలోని సమస్యలోకి వెళ్ళకపోవటమే ఈ సినిమా కథకున్నప్రధాన సమస్య.ఎప్పటికో మురళిమోహన్ చెప్పే ప్లాష్ బ్యాక్ పూర్తి కావాలి, అప్పుడు గానీ మన హీరో చక్రధర్ చలనంలోకి వచ్చి విలన్స్ పనిపట్టడు. అప్పటివరకూ మనకెంత ఓపికకావాలి. అప్పటివరకూ ప్లాష్ బ్యాక్ లో కనపించే జయసింహకు సమస్యలు రావా అంటే కథ ప్రకారం చక్రధర్ కి సమస్య వచ్చి వాటిని ఫేస్ చేస్తేనే కదా కథనం రక్తి కట్టేది. ఇంతకు మించి రొటీన్ గా సాగే ఈ కథ, కథనాలను విశ్లేషించటానికి కూడాఏమీ లేదు.
అలాగే మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు కనపడి షాక్ ఇస్తాడు. మరో ప్రక్క కోడి రామకృష్ణ, బోయపాటి శ్రీను, జొన్నవిత్తుల, సింగీతం శ్రీనివాసరావు వంటి సినీ ప్రముఖులను చూపి ఆకట్టుకోవాలని చూడటం దాసరి వంటి మెగా(అప్పట్లో) దర్శకుడు ప్రయత్నించటం కూడా ఆశ్చర్యమనిపిస్తుంది. బాలకృష్ణతో కథకు సంభందం లేని వివిధ గెటప్స్, డైలాగులు, సెలబ్రేటీలను చూపటం ఇదంతా చూస్తుంటేనే ఏదో రకంగా ఒడ్డున పడాలని ప్రయత్నిచినట్లు స్పష్టంగా తెలిసిపోతూంటుంది. వీటిన్నట్టికీ తోడు హీరోయిన్స్ అమీషా పటేల్, షీలా, నేహా ధూపియా…వీళ్ళలో ఒక్కరికీ సరైన పాత్ర, డైలాగులు, జస్టిఫికేషన్ ఉండదు. కేవలం బాలకృష్ణను ఎలా చూపాలా అని ఆలోచించి డిజైనా చేసినట్లుగా సినిమా అంతా జరుగుతూంటుంది.
ఇక సినిమాలో ప్లస్సులు లేవా అంటే…అది బాలకృష్ణే. ఆయన నటన, డైలాగులు చెప్పే తీరు సినిమా సినిమాకూ పదునెక్కుతోందని స్పష్టం చేస్తుందీ చిత్రం. అలాగే క్లైమాక్స్ లో కోర్టులో చెప్పే డైలాగ్స్ కూడా బావున్నాయి. అలీ, బ్రహ్మానందం చేసిన రోబో పేరడీ కామెడీ ఏ సి సెంటర్ల వారకన్నా ఎక్కాలేమో కానీ మిగతావారికి కష్టం. అదే దాసరి టార్గెట్ అయితే అంతవరకూ విజయం సాధించినట్లే. సీనియర్ నటులు కోట శ్రీనివాసరావు, మురళి మోహన్, జయసుధ, రఘుబాబు వంటివారుకి పెద్ద పాత్రలు లేకపోయినా ఉన్నంతలో బాగా చేసారు. చాంతాడంత డైలాగులకు దాసరి నారాయణ రావు పెట్టింది పేరనే విషయం మరో మారు గుర్తుకు వస్తుంది. అయితే డైలాగులు కొన్ని చోట్ల బాగానే పేలాయి. అయితే ధియోటర్ నుంచి బయిటకు వచ్చాక ఏదీ గుర్తుండే అవకాశమేలేదు. ఇక పాటల విషయానికి వస్తే మణిశర్మ అప్పుడప్పుడూ ఎవియస్ చిత్రాలకు ఇచ్చిన సంగీతంలా నీరసంగా ఉంటుంది. నేపధ్య సంగీతమూ అదే రేంజిలో ఏడ్పిస్తుంది. కెమెరా, మేకప్, ఎడిటింగ్, ఆర్ట్ దాదాపు అన్ని విభాగాలు దాసరి గారి పురాతన దర్శకత్వానికి పోటీ పడి పనిచేసాయి.
పైనల్ గా ఈ చిత్రం బాలకృష్ణకు ఎలాంటి దర్శకులను, కథలను ఎంచుకోవాలి అన్న విషయంలో స్ఫష్టమైన ఆలోచనలు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సింహాతో పోల్చుకుంటే ఈ చిత్రం ఎక్కడ దెబ్బతిందో ఇట్టే కనిపెట్టేయచ్చు. అలాగే అదే సమయంలో దాసరిగారు ఇంత దారుణమైన ప్లాపులు ఇవ్వకుండా ఉండటానికి ఏకైక మార్గం కొంతకాలం పాటు దర్శకత్వానికి దూరంగా ఉండటమే బెస్ట్ అని ఈ చిత్రం చెప్తుంది. ఇక మనలాంటివారికి సింహా లాంటి హిట్ తర్వాత వచ్చే ప్రతీ చిత్రం సింహా కానక్కర్లేదని, ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని నిరూపిస్తుంది.
http://teluguratna.com/wp-content/uploads/2011/01/Fr11.gif