Thursday, February 10, 2011

సెల్‌ఫోన్‌లో ప్రపంచకప్‌

ఈ నెల 19న ప్రారంభం కానున్న ఐసిసి ప్రపంచకప్‌ మ్యాచ్‌లను వోడాఫోన్‌ తన ఖాతాదారులకు మొబైల్‌ ఫోన్లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ టోర్నమెంట్‌ ప్రసార హక్కులు పొందిన ఇఎస్‌పిఎన్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ నుండి ఈ హక్కులను వోడాఫోన్‌ సంపాదించింది. ఇంటర్నెట్‌ అందుబాటులో ఉన్న వోడాఫోన్‌ సెల్‌ఫోన్‌ వినియోగదారులు ఈ సదుపాయం పొంద వచ్చు. ఎంచక్కా బస్‌ల్లో, ఇతర ప్రాంతాల్లో మ్యాచ్‌లను చూసి ఆనం దించవచ్చు. టోర్నమెంట్‌లోని మొత్తం 49 మ్యాచ్‌లు సెల్‌ఫోన్‌ వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. 2జి, 3జి హాండ్‌సెట్‌ వినియోగదారులందరికీ ఈ సదుపాయం లభిస్తుంది. ఏ సమయంలోనైనా, ఎక్కడైనా ఈ మ్యాచ్‌లను తమ సెల్‌ఫోన్లలో తిలకించే అవకాశం కలగనుంది.

No comments:

Post a Comment