“ఏమ్మా నీలూ … ఇంకా నీరసంగా అలా కూర్చున్నావేంటి? నా తల్లివి కదూ, లేచి తెములమ్మా, మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది’’ అంటూ తొందర చేసింది అనసూయమ్మ మనుమరాల్ని. అయినా ఉలకలేదు పలకలేదు నీలోత్పల. “నా తల్లి! ఏమైందే నీకు? ఎప్పుడూ నవ్వుతూ, తుళ్ళుతూ ఉండేదానివి, ఇలా అయిపోయావేంట్రా?’’ అంది అనసూయమ్మ ఆందోళనగా. సెలయేటి జలపాతంలా గలగలలాడే తన మనుమరాలు ఇలా అశోకవనంలో సీతలా మౌనముద్ర దాల్చి కూర్చోవడాన్ని భరించలేకపోతోంది అనసూయమ్మ. ఏదో పరధ్యానం, ఏ పని చేసినా తడబాటు, ఆషాడంలో ఎడబాటుకే ఈ పిల్లకి ఇంత తడబాటయితే ఎలా? అయ్యోరామా! తమ కాలంలో అయితే ఆషాడమాసం వచ్చిందంటే చాలు కొత్తగా పెళ్ళయిన వారు అసలు ఒకర్ని ఒకరు చూసుకోవడంగానీ, కలుసుకోవడంగానీ, మాట్లాడుకోవడంగానీ ఉండేది కాదు. కొత్తల్లుడ్ని మళ్ళీ మామగారు శ్రావణంలో తీసుకొని వచ్చి, గడప గడపకి లెక్కపెట్టి కొబ్బరికాయలు కొట్టించి, రకరకాల తంతులు జరిపించేవారు. ఇక ఆ నెలంతా కటిక పత్యం. అపుడపుడే టోల కలయికలోని తియ్యటి రుచులను చవి చూసి ఉండేవారేమో ఒకరి కోసం ఒకరు తహతహలాడిపోయె వారు. కానీ ఇపుడేముంది? సంప్రదాయాలూ లేవు, చట్టబండలూ లేవు. అదిగో ఆ సెల్ ఫోన్లో, గల్లుఫోన్లో వచ్చాయి. ఇక వాటిల్లో ఒకటే గుసగుసలు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్లిపోవడం, కల్సుకోవడం, అంతా ఇడప కాలం, పిదప బుద్ధులు అందుకే పెడసరపు సంతానం’ స్వగతంగా అనుకుంది అనసూయమ్మ.
మనుమరాలి దగ్గరకెళ్ళి వీపు తట్టింది. పరధ్యానంగా కూర్చొని, దీర్ఘంగా ఆలోచిస్తున్న ఉత్పల తుళ్ళిపడి లేచి తన ఏమరుపాటుకి నవ్వుకుంది చిన్నగా “ఈ పరధ్యానం ఆ పరధ్యానమేలే … దానికి తగ్గ మందు నేను వేస్తా కదా’’ అని గుంభనంగా నవ్వుకున్న అనసూయమ్మ మనుమరాలిని స్నానానికి వెళ్ళమని మళ్ళీ తొందర చేసింది.
నీలోత్పల అనసూయమ్మ కొడుకు పరందామయ్యకు ఏకైక సంతానం. నలుపు, తెలుపు కాకుండా శ్రీరాముడిలా నీలం రంగులో ఎంతో ఆకర్షణగా ఉంటుందని ‘నీలోత్పల’ అని పేరు పెట్టారు.
చిన్నప్పటినుంచీ అల్లారుముద్దుగా పెంచారు.
ఒకరకంగా తల్లిదండ్రుల దగ్గరకంటే అనసూయమ్మ దగ్గరే ఆమెకు చనువెక్కువ.
ఇటీవలే వేసవి కాలపు చివరి లగ్నాల్లో అగ్నివేష్ తో పెళ్ళి జరిపించారు. మొదటిరాత్రి అయిన కొద్దిరోజులకే ఆషాడం వచ్చేసింది.
“ఏంటి బామ్మా! నన్ను తొందర చేసి నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు?’’ అంటూ గిలిగింతలు పెట్టిన మనుమరాలి పిలుపుతో ఊహల్లోంచి బయటపడింది అనసూయమ్మ. ఒక్కసారి మనుమరాల్ని ఆపాదమస్తకం సంతృప్తిగా చూసుకుంది. ఆ చూపులో ‘తన మనుమరాలు తనంత అందగత్తే’ అనే అతిశయం నిండి వుంది.
“ఇంతకీ ఈ రోజు ఏ గుడికి తీసుకెళ్తున్నావు నానమ్మా?’’ అడిగింది ఉత్పల నానమ్మ మెడ చుట్టూ చేతులు వేసి గారంగా.
కాలక్షేపమౌతుందని రోజుకో గుడికి తిప్పుతోంది అనసూయమ్మ మనుమరాల్ని.
“మన్మథాలయానికి! నువ్వే వెళ్తావు, నేను రాను’’ అంది అనసూయమ్మ.
“మన్మథాలయానికా? అదెక్కడుంది? మన ఊర్లో అలాంటి గుడి ఏడీ లేదే?’’ అయోమయంగా అడిగింది ఉత్పల.
“రాత్రి మన అవుట్ హౌస్ లో మన్మథుడు వెలిశాడులే, నీ హృదయ చోరుడు, అగ్నివేష్ కి ఆషాడంలో ఒక్కసారి నిన్ను చూపించాలని నాకెందుకో తెగ మనసు రోదపెడుతోంది. అతనేమో అందరు కొత్తపెళ్ళికోడుకుల్లా నిన్ను ఆషాడం అయినా తనతో పంపించమని గోలచేయక బుద్ధిగా అతని పని అతను చేసుకుంటున్నాడు. నువ్వేమో అతని కోసం ఊహల ఊయలలో తేలిపోతే, పరధ్యానంతో మందమతిలా తయారయ్యావు. అందుకే ఈ రాత్రి మీ అమ్మా నాన్నా వాల్తేరు వెళ్తున్నారు. నువ్వేమో అగ్నివేష్ దగ్గరికి వెళ్తున్నావు. ఊ … త్వరగా తెములు’’ అంది అనసూయమ్మ కొంటెగా.
“అమ్మో! అతని దగ్గరికి నేను వెళ్ళను బాబూ’’ అంటూ పైకి అయిష్టం నటించింది ఉత్పల.
కానీ లోలోపల ఆనందంగాను, ఆశ్చర్యంగాను ఉంది. ఎప్పుడెప్పుడు అగ్నివేష్ ఒడిలో వాలిపోయి, అతని బిగి కౌగిలిలో కరిగిపోవాలని ఆమె మనసు తహతహలాడు తోంది. నానమ్మ ససేమిరా ఆషాడంలో అల్లుడు అత్తవారింట్లో అడుగుపెట్టకూడదని తెగేసి చెబుతుంది. మరిప్పుడేమిటి? ఆశ్చర్యంగా ఆమె స్వయంగా అగ్నివేష్ దగ్గరికి పంపిస్తానంటుంది? అగ్నివేష్ ఏం మాయ చేశాడో నానమ్మని, అమ్మో! మహా గడసరి! ఎదుటివారిని నొప్పించకుండా ఒప్పించి, తన మార్గంలోకి తెచ్చుకోవడంలో సిద్ధహస్తుడు. ఆ విషయం పెళ్ళి చూపుల్లోనే తనకు తెలిసింది. అసలు అతన్ని పెళ్ళిచూపుల్లో మొదటిసారి సిగ్గుల బరువుతో, కనురెప్పలు వాలిపోవడంతో సరిగా చూడనేలేదు తను.
‘ఏం.టెక్ చదివి, అలా సిగ్గుపడిపోతున్నావేంటని’ అమ్మలక్కలు ఆటపట్టించారు. అది గమనించి అగ్నివేష్ తనే చొరవ తీసుకుని, ఒక్క ఐదు నిమిషాలు తనతో ఏకాంతంగా మాట్లాడాలని నాన్నగారిని కోరాడు.
వెంటనే తనని ఒంటరిగా హాలులో వదిలి పెద్దవారు బయటకు వెళ్ళిపోయారు.
ఎదురుగా ఉన్న కుర్చీని దగ్గరకు జరుపుకొని “మీరు నాకు నచ్చారు. నేను మీకు నచ్చలో లేదో జాగ్రత్తగా చూసి చెప్పండి. ఈ నక్షత్రాలూ, జాతకాలూ నాకు నమ్మకం లేదు. అలాగని మీ పెద్దవారి నమ్మకాన్ని తప్పుపట్టడం లేదు. కానీ మనం ఇంత చదువు చదివి, ఎంత అభివృద్ధి చెందినా జాతకాలంటూ పట్టుబడుతున్నారే తప్ప – ఇద్దరి బ్లడ్ గ్రూపులు ఏమిటి? హెల్త్ కండీషన్ ఏమిటి? ఎయిడ్స్ లాంటి వ్యాధులు ఉన్నాయోమోనని తెల్సుకోవడం కోసం ఇద్దరి హెల్త్ ప్రోఫైల్స్ ఎంతమంది అడిగి తెలుసుకుంటున్నారు? ఆనక- అంతా అయిపోయిన తర్వాత ఇద్దరిలో ఏ ఒక్కరికి అవాంఛనీయమైన వ్యాదులున్నా- జీవిత భాగస్వామి, పిల్లలు నరకం అనుభవించాలి. అందుకే ఇదుగోండి నా కంప్లీట్ హెల్త్ మాస్టర్ ప్రొఫైల్. నేను కూడా మీకు నచ్చితే మీడి కూడా లేటెస్ట్ హెల్త్ రికార్డు మాకు పంపించండి’’ అని తన చేతిలో వున్న పెద్ద కవరు ఉత్పల కందించాడు. తర్వాత తమ పెద్దవారు వచ్చాక కూడా అదే విషయం చెప్పి వారిని ఒప్పించాడు. సరిగ్గా ఇదే విషయం ఉత్పలకి అతనిపై ఎంతో గౌరవభావాన్ని, ఆరాధానని కలుగజేశాయి. అతని ముక్కుసూటితనం, ఎదుటివారిని నొప్పించకుండా విషయాన్ని విడమరచి చెప్పి ఒప్పించడం ఎంతో నచ్చింది ఉత్పలకి. అంటే అగ్నివేష్ అంటే ఫ్లాట్ అయిపోయింది. పెళ్ళి జరిగిపోయింది. మొదటి చూపులోనే బక్కపలుచగా, రివటలా ఉన్న అతన్ని చూసి “ఇదేంటి? ఇంత నాజూగ్గా ఉన్నాడు?’’ అనుకుంది తను. కానీ ఆ ఆరడుగుల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చేతల్లో మాత్రం హార్డ్ వేర్ ఇంజనీరేనని, పైకి కనిపిస్తున్నంత సాఫ్ట్ కాదని మొదటిరాత్రే తెల్సుకుంది. అసలు అగ్నివేష్ మొదటి రాత్రి చేసిన చిలిపిపనులు వర్ణించాలంటే మరో కాళిదాసు దిగి రావలసిందే.
ఉంటున్నావు. అందుకే నేనే అతన్ని పిలిపించాను. ఒక్కసారి కనిపించి వెళ్ళమని’’ అన్న అనసూయమ్మ మాటలతో, ఆలోచనలకు స్వస్తి చెప్పి మారుమాట్లాడకుండా స్నానానికి వెళ్ళింది ఉత్పల. ఒంటిపైన నీటి బిందువులతో, శిల్పంలా మెరుస్తున్న శరీరానికి మీగడ, పెరుగు, సున్నిపిండి నలుగు పెట్టుకుని, సవర కింద చల్లని నీటిలో తనివితీరా జలకాలాడుతోంది.
మధ్యమధ్యలో పూర్తి నగ్నంగా, యవ్వన శోభతో మిడిసిపడుతోన్న తన దేహాన్ని చూసుకుంది. చటుక్కున అగ్నివేష్ గుర్తొచ్చాడు. సిగ్గుల మొగ్గైపోయింది శరీరమంతా, ఇరవై ఏళ్ళనుండి అపురూపంగా కాపాడుకున్న పూలతోటలాంటి శరీరాన్ని అతనికోసం పూలతల్పంలా మార్చింది. తన శరీరంలో మారుమూలల దాగి ఉన్న అందాల్ని కూడా నిలువుదోపిడి చేసిన చిలిపిచోరుడు అగ్నివేష్! మళ్ళీ ఈ రాత్రి అతని బిగి కౌగిలిలో కరిగిపోబోతోంది. ఒక్కసారిగా ఒళ్ళు పులకరించింది. ఉత్పల స్నానం చేసి వచ్చేసరికి సెల్ లో అగ్నివేష్ పంపిన ఎస్,ఏం,ఎస్, ఆమెను గిలిగింతలు పెట్టింది.
*****
సాయంసంధ్య ప్రకృతిని సింధూర వర్ణపు చీరతో కప్పేసింది. అవుట్ హౌస్ ఎదురుగా కొంచెం దూరంలో ఉన్న ఇంద్రభవనం లాంటి ఇంటి నుంచి రూపుదాల్చిన వసంత కన్యలా నడిచి వస్తోంది ఉత్పల. ఆమె కోసమే నవమన్మథునిలా వేచి చూస్తున్నాడు అగ్నివేష్. ఉత్పల నడిచి వచ్చే తీరును కుతూహలంగా గమనిస్తున్నాడు. వయ్యారంగా నడిచివస్తోంది. ఆమె గుండె వేగం హెచ్చి, ఆలయ శబ్దం ఆమెకే స్పష్టంగా వినిపిస్తోంది. అవుట్ హౌస్ గడపదాటి లోనికి రావడానికి సంశయిస్తున్న ఆమెను ఎదురెళ్ళి సున్నితంగా తన దక్షిణహస్తాన్ని ఆమెకందించి పూలగుత్తిని పట్టుకున్నట్టు పట్టుకుని లోనికి నడిపించుకెళ్ళాడు. విశాలమైన బెడ్రూంలో తెల్లటి బెడ్ షీటు పరిచిన మంచం మీద కూర్చోబెట్టాడు. అంత చల్లగా ఉన్న ఏ.సి. గదిలోనూ ఆవిర్లు వస్తున్నాయి. ఇరువురి శరీరాల్లోనుంచి.
“నా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన అపర రతీదేవి గారికి థాంక్స్’’ అంటూ ఆమె పక్కనే కూర్చొని సున్నితంగా భుజంపై చెయ్యి వేశాడు.
అప్పటివరకు ఆ గదిలో పరుచుకున్న రూమ్ ఫ్రెష్ నర్ సువాసనల్ని ఒక్కసారిగా వ్యాపించిన ఆమె తలలోని మల్లెల పరిమళం డామినేట్ చేసింది. ఆషాడంలో పూసిన ఆఖరి మల్లెలు కావడంతో మరింత పరిమళాలతో మత్తెక్కిస్తున్నాయి అగ్నివేష్ ని.
“అమ్మో! ఏమిటి ఇంత సాహసం? నాన్నగారికి గాని తెలిస్తే ఇంకేమైనా ఉందా? అయినా ఇంకో పడి రోజులాగితే శ్రావణం వచ్చేస్తుంది. ఎందుకింత తొందర?’’ భయం భయంగా అంది ఉత్పల.
“నేనేమీ నిన్ను పంపమని బామ్మగార్ని బలవంతం చెయ్యలేదు. ఊరికే జస్ట్ క్యాజువల్ గా వస్తున్నానని చెబితే నువ్వేదో బెంగపడిపోతున్నవనీ, ఒక్కసారి దేవిగారికి కనిపించి వెళ్ళమంటే వచ్చాను. అయినా నేను మాత్రం నిన్నీమీ చెయ్యనని మాటిచ్చాకే పంపించారు బామ్మ’’ అన్నాడు.
“అంటే నేనే అంతా చేసే దానిలా కనిపిస్తున్నానా మీకు?’’ అంటూ చూపులతో చుర చుర లాడించింది ఉత్పల.
“అది కాదే – పిచ్చి బంగారం! ఈ దాసుని ఏకాంత సేవలో పరవశించి, ఈ శృంగార రసదేవతే ఏదైనా చెయ్యొచ్చు కదా!’’ అన్నాడు అగ్నివేష్ ఆమెను ఉడికిస్తూ.
“అంత ఉబలాంటం లేదులే నాకు’’ అయిష్టం నటించింది ఉత్పల.
కానీ ఎప్పుడెప్పుడు అతను దగ్గరకు తీసుకుంటాడా, అతని కౌగిలిలో గువ్వలా ఒదిగిపోదామా అని ఎదురుచూస్తోంది.
“సరేరా, నేను నిన్నేమీ చేయకుండా నువ్వే అన్నీ చేసేలా చెయ్యనా?’’
“మీతరం కాదులే’’ అంది బింకంగా.
“పందెం’’ అన్నాడు.
“ఏమిటి పందెం?’’ అంది
“మల్లెమొగ్గలు, పిల్లబుగ్గలు ఒకటే విరహంలో గుచ్చుకుంటాయి, సరసంలో విచ్చుకుంటాయి’’ అన్నాడు ఆమె జడలో నిండుగా తురిమిన మల్లెల పరిమళాన్ని ఆఘ్రాణిస్తూ.
“పైత్యం బాగా పెరిగిపోయింది అయ్యగారికి’’ కొంటెగా చూస్తూ అంది.
“అది పైత్యం కాదు తాళలేని విరహం, నీ శరీరంలోని అంగాగాల్ని వర్ణించి నిన్ను వివశురాల్ని చేసేయ్యనా?’’ అంటూనే జవాబుకోసం చూడకుండా ఆమెను డబుల్ కాట్ మధ్యలో వెల్లకిల్లా పడుకోబెట్టి, కుడి మోకాలు పైకి ఉండేలా సరిచేశాడు. ఉత్పల పడుకున్న ఆ భంగిమ పాలరాతి శిల్పం పవళించినట్టుంది. ఓసారి ఆమెను తనివి తీరా తృప్తిగా చూశాడు. “ఈ ఐదడుగుల ఆరంగుళాల వయ్యారం, ఇరవై ఆరు అంగుళాల నడుము నయాగారం, ఇరవై పేజీల తొలి యవ్వనం నాకే సొంతం’’ అంటూ ఆమె చెవిలో గుసగుసలాడాడు.
మెల్లగా లేచి ఆమె పాదాల వెళ్ళని తన చేతివేళ్ళతో మెల్లిగా తాకి కొద్దిగా వంగి పెదాలతో స్పృశించాడు. “అబ్బ! గోరింటాకు పెట్టిన నీ పాదాలు చూడు ఎంత అందంగా ఉన్నాయో చిగురుటాకుల్లా, చిగురుటాకులా ఈ పాదాలు … రాసహింసల ప్రణయ నాదాలు’’ అంటూ ఆమె కాళ్ళ మెట్టెలు, పట్టీలు సవరిస్తున్నాడు. ఎక్కడో హృదయంతరాళల్లో జివ్వుమని లాగేసిన భావన ఉత్పలలో మోకాళ్ళ వరకు జరిగిన చీరలోనుంచి కన్పించే నునువైన ఆమె కాళ్ళను కుచ్చెళ్ళ పైనుండి వేళ్ళతో హార్మోనియం మెట్లను నొక్కినట్లు నొక్కుతూ “అరటి బోదెల్లాంటి నీ ఊరువులు- సరస సల్లాపకేళికి మేరువులు’’ అంటూ ముద్దాడాడు. ఏదో చోద్యం చూస్తున్నట్టు చూస్తున్న ఉత్పలలోని నవనాడులూ ఒక్కసారి జివ్వుమన్నాయి. అక్కడినుండి అతని చూపులు నగిషీలు చెక్కిన శృంగార శిల్పం లాంటి ఆమె నడుం మీద నిలిచాయి. నిగనిగలాడుతున్న ఆ నడుంపై తేలిన నర్మదా నది పాయల్లాంటి పల్చటి మడతలను చేతులతో తడిమాడు. రెండు చేతులను నడుం చుట్టూ బిగించాడు. సరిగ్గా అతని అరచేతుల్లో సరిపోయేంత సన్నగా ఉందది. “ఈ నడుమందం ఎంత నడమంత్రం? మిడిసిపడుతోంది రేసు గుర్రంలా ఒడిసి పడతా నా పిడికిట కళ్ళెమేస్తా నా కౌగిట’’ అంటూ రెండు చేతులతో బిగించాడు. ఉక్కిరిబిక్కిరయింది ఉత్పల. ఏదో రియాక్షన్ సన్నగా మొదలవడం ఆమెకు స్పష్టంగా తెలుస్తోంది. అయినా ఎంత మాత్రం చలించకూడదని నిగ్రహించుకుంటోంది. “బ్రహ్మగోరు సోకిందేమో ఈ ముద్దుగుమ్మకి పాల సంద్రంలో సుడిగుండమల్లే మారే నాజూకు నడుముకి’’ అంటూ పల్చని లోతైన ఆమె నాభిని గాడంగా చుంభించాడు. అంతే … ఒక్కసారిగా ఏదో పెను సంచలనం ఉత్పలలో శరీరంలో వేల వోల్టుల విద్యుత్తు ప్రవహించినట్టు తియ్యని షాక్! ఉలిక్కిపడింది. అయినా తమాయించుకోవాలని పళ్ళబిగువున ప్రయత్నిస్తోంది. అగ్నివేష్ పెదవులపై ఓ చిరుదరహాసం విరిసింది. విజయానికి సూచనగా.
పొంకం’’ అంటూ నున్నని ఆమె మెడనిమిరాడు. “ముక్కు సంపెంగ, బుగ్గ పున్నాగ, పలువరస దానిమ్మ, మెనీ ఛాయ నేరేడమ్మ’’ అంటూ చెవిలో గుసగుసలాడి, తమ్మెలను మునిపంటితో నొక్కి కనులపైన నుదిటిపైన ముద్దుల వర్షం కురిపించాడు. “ఈ దొండపళ్ళ పెదవులు చుంబిస్తే మరీ ఎర్రబడి పోతాయేమో’’ అతనూ చటుక్కున ఎర్రటి ఆమె పెదవులను చుంభించాడు. అంతే … ఇక అప్పటి అరకూ అతి బలవంతంగా తనని తాను నిగ్రహించుకుంటూ వచ్చిన ఉత్పల ఇంకా నిలువలేకపోయింది. ఒక్కసారిగా రెండు చేతులతో అతన్ని చుట్టేసి తననేదేదో చేసేయ్యమన్నట్టు బలంగా తనవైపు అదుముకుంది. అతనికి ఆమె పట్టునుండి విడిపించుకోవడం కష్టంగా ఉంది. బలవంతంగా కొద్ది ఎడంగా జరిగి ఆమెని తనివితీరా చూశాడు. చీర, రావికలు స్థానభ్రంశం చెందాయి. అర్థనగ్నంగా మారిన ఆమె శరీరానికి పమిటను తీసి కప్పాడు అగ్నివేష్. ఒక్కసారిగా ఎంతో అసహనంగా ఫీలయింది ఉత్పల. “అదేంటో విప్పవలసిన సమయంలో కప్పుతున్నారేంటీ?’’ తమకంగా అడిగింది.
ఉవ్వెత్తున ఎగిసిన అల ఒక్కసారి నేలమీద పడి ముక్కలు ముక్కలైనట్లైంది. ఆమెలోని ఆవేశం “ప్లీజ్ అగ్నివేష్ ప్లీజ్ ఒక్కసారి’ అంటూ అభ్యర్థిస్తూ కౌగిలించుకోబోయింది
రోజులగు. ఇంక రోజూ స్వర్గమే! నీతో ఒక్కరోజు ఏకాంతంగా గడపడానికి బామ్మను ఒప్పించి, నిన్ను రప్పించానుగానీ అందరూ ఆరిష్టమని, అనర్థమని తలచే ఆషాడంలో నిన్ను అనుభవించడానికి కాదు. నిన్ను ఉడికించడానికే అలా రెచ్చగొట్టాను గాని పెద్దల మనోభావాల్ని, సంప్రదాయాల్ని తోసిరాజనడానికి కాదు. ఆషాడం ఒక్కనెల విడిగా ఉండలేక, దోగాచాతుగా కల్సుకొని ఆ సుఖం కోసం వెంపర్లాడే వారికీ మనకూ తేడా ఏముంటుంది? ఇంత ఏకాంతం దొరికినా నిగ్రహించుకొని నిలబడడమే మన శీలానికి పరీక్ష. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో’’ అంటూ ఆమె తలపై చెయ్యివేసి ప్రేమగా నిమిరి గుండెలకు హత్తుకున్నాడు. సరిగ్గా అప్పుడు తలెత్తి అతని కళ్ళలోకి చూసింది ఎంతో ఆరాధనగా ఆమె. ‘ఎంత గొప్ప నిగ్రహమితనిది? ఎలా సాధ్యమైంది అగ్నివేష్ కి ఇంత చిన్న వయసులో’ అనుకుంటూ అతన్ని అల్లుకుపోయింది.
అప్పటికి సరిగ్గా అర్థరాత్రి పన్నెండు గంటలు చూపిస్తోంది గడియారం. బాత్రూం నుంచి స్నానం చేసి వచ్చిన ఉత్పల తన పొడవాటి జడలో నలిగిపోయిన పూలను తీసి డస్ట్ బిన్ లో వేసింది. కానీ నలిగిపోయిన చీరను చూసుకొని ‘నాన్నమ్మ ఏమనుకుంటుంది? ఛీ- పాడు’ ఏం చేయాలా అని ఆలోచనలో పడింది. సరిగ్గా అప్పుడు అలాంటిదే మరో చీర తీసి కట్టుకోమన్నాడు అగ్నివేష్. “ఇదెక్కడిది?’’ ఆశ్చర్యంగా అడిగింది ఉత్పల.
“నీ కోసమే తెచ్చాను’’ అన్నాడతను.
“ఎందుకు?’’ ఆశ్చర్యపోయింది.
“నువ్వు కట్టుకోచ్చిన చీర నలిగిపోతుందిగా అందుకని’’ అన్నాడు.
“నేను ఈ చీరనే కట్టుకోస్తానని మీకెలా తెల్సు?’’ ఆశ్చర్యంగా అడిగింది.
బాగా నచ్చింది ఈ చీరేగా అందుకే. అదే కట్టుకోస్తావని నేనూహించాను’’ అంటూ గుంభనంగా నవ్వాడు.
“అమ్మో! ఎంత గడసరి!’’ అని చటుక్కున అతన్ని ముద్దుపెట్టుకుంది.
అతనిచ్చిన చీర కట్టుకుని, చెరిగిపోయిన తలని చక్కగా దువ్వి జడేసుకుంటూ “ఒసే ఉత్పలా! నీ మొగుడితో చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా! నీకు కోపం వస్తే ఈ జడతోనే వాడి మెడకు ఉరెయ్యోచ్చు’’ అని జడేసేటప్పుడు నానమ్మ అనే మాటలు గుర్తొచ్చి చిన్నగా నవ్వుకుంది. పొడవాటి మల్లెచెండును మెల్లిగా అందించాడు.
మరీ ఆశ్చర్యపోయింది ఉత్పల. “ఇవి ఇప్పుడెందుకు?’’ అని అడిగింది.
“బామ్మ నిన్నెలా పంపిందో అలా మరల అప్పగించాలి కదా’’ అన్నాడు క్షణాల్లో తను ఎంత ఫ్రెష్ గా ముస్తాబై వచ్చిందో మరల అలాగే తయారైందామె. బయలుదేరేముందు అడిగాడు ఉత్పలని … “పందెంలో ఎవరు గెలిచారు?’’
“నన్ను రప్పించి ఆషాడంలో శ్రావణాన్ని తెప్పించి, మీరు గెలిచారు. శ్రావణం వచ్చిన్దనుకున్న రాత్రి కూడా ‘ఆషాడాన్ని’ అలాగే పదిలంగా ఉంచి నన్ను గెలిపించారు’’ ముసిముసి నవ్వులు నవ్వుతూ చెప్పింది ఉత్పల.
“అంతే కాదు మనిద్దరి మీద నమ్మకంతో ఇంత ఏకాంతాన్ని కల్పించిన బామ్మగారి నమ్మకాన్ని వంముచేయక ఆమెని కూడా గెలిపించాము’’ అంటూ ఉత్పలను పొదవిపట్టుకొని, తనివితీరా ముద్దాడాడు.
కొద్దిసేపట్లో ఉత్పలని తీసికెళ్ళి బామ్మకు గుమ్మం బయట నుండే అప్పగించాడు. తిరిగి వచ్చేప్పుడు “బామ్మగారూ! ఉత్పలను నేనేం చెయ్యలేదు. కావాలంటే చూసుకోండి, ఎలా వచ్చినదాన్ని అలాగే ‘నలగకుండా’ అప్పజెప్పాను’’ అన్నాడు.
“ఓరి దొంగభడవా!’’ అంటూ అనసూయమ్మ అగ్నివేష్ చెవి మెలితిప్పింది సున్నితంగా

No comments:
Post a Comment