
శరీరానికి తిండి, విశ్రాంతి ఎలా అవసరమో సెక్స్ కూడా అంతే... సరైన సెక్స్ సుఖం లేని వారు మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపు ణులు చెబుతుంటారు. అయితే మహిళలు ముఖ్యంగా భారతీయ స్ర్తీలు కట్టుబాట్లు, ఆచారాల మధ్య పెరుగు తారు కనుక ఈ విషయం శ్రద్ధచూపనట్లు కనిపిస్తారు. కాని వారిలో కూడా సెక్స్ కోరికలు మగవారి స్థాయి లోనే ఉంటాయి. ఈ విషయంలో భర్తలే శ్రద్ధతీసుకొని భార్యలను అర్థం చేసుకోవాలి. అయితే నేటి బిజీ బిజీ టెన్షన్ లైఫ్ వల్ల మగవాళ్ళలో కూడా సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ తగ్గిపోతున్నదని ఇటీవల కొన్ని అధ్యయనాలు చెబు తున్నాయి. భార్యా భర్తలు మానసికంగా ఉల్లాసంగా ఉన్నప్పుడే పూర్తి సెక్స్ సుఖాన్ని అనుభవిస్తారు. కాని నేటి పరిస్థిలు అలా లేవు. అయినప్పటికీ మన బిజీ షెడ్యూల్లో కొంత సమయాన్ని శృంగారం కోసం వెచ్చించినప్పుడే సంపూర్ణ సుఖాన్ని అనుభవిస్తారు. దానికోసం ప్రతిసారి సెక్స్‌లో కొత్తదనాన్ని చూపించాలి. అందుకోసం శృంగారంలో కొన్ని రకాల మెళకువలను అనుసరించడం మంచిది. ఈ నేపథ్యంలో... పది టెక్నిక్‌ల గురించి తెలుసుకుందాం...
సామర్థ్యానికి కొదవ లేనప్పటికీ, రోటీన్ సెక్స్ అనుభవించడం, వారికి లేక వారి భాగస్వామికి విసుగు కలిగిస్తుండటం, ఓపిక లేకపోవడం వంటి కారణాలతో వారానికి ఒకటి లేక రెండు పర్యాయాలు సెక్స్‌లో పాల్గొనడం కూడా కష్టంగా మారు తోంది. అటువంటి వారు ఈ సలహాలు పాటించి చూస్తే రతిక్రీడలో స్వర్గపు టంచులకు చేరుకోవచ్చు. గతంలో విన్నవిగానే అనిపించినా... వాటిని ఏ మాత్రం ఆచరించారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. మీ దాంపత్య జీవితం నిండుగా సాగాలంటే ఈ చిట్కాలను ప్రయత్నించండి.
జంటగా స్నానం...
మీరు, మీ భాగస్వామి కలసి, వేడినీళ్ల స్నానం చేయడం ద్వారా మధుర స్పర్శ అందుకుంటారు. ఒకరి శరీరానికి మరొకరు సబ్బు రుద్దడం ద్వారా, ఆసమయంలో సెక్సీగా గుసగుసలు విన్పించుకోవడం ద్వారా ఇద్దరిలోనూ కామవాంఛలు బాగా బలపడుతాయి.
స్పెషల్ డిన్నర్...
తేలికపాటి మంటను ముందుంచుకుని ఇద్దరూ కలసి భోజనం చేయండి. ఆసమ యంలో శరీరం బాగా అతికినట్టు కనిపించే దుస్తులు ధరించడం మంచిది. వీలైతే నగ్నం గా ఉంటూనే కలసి, భోజనం చేయండి. సులభంగా తినే పదార్థాలు మాత్రమే ఆ తరహా విందులో ఉండేలా చూసుకోండి.
ఎల్లప్పుడూ మీ ధ్యాసే...
మీరు ఆఫీసుకు లేదా బయటకు వెళుతున్న సమయాల్లోనూ మీ భాగస్వామి మీ ఆలోచనలతోనే గడిపేలా చేయాలి. బయటకు వెళ్లేముందు ఆమె తొడపై చెయ్యి వెయ్యడం, చెవిలో సెక్సీ మాటలతో గుసగుసలాడటం, వారి మెడ భాగంలో ముద్దు పెట్టడం వంటి చర్యలు వారిని ఆ రోజంతా మీ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉండేట్లు చేస్తాయి.
గాఢ చుంబనం...
మీరెన్ని సార్లు మీ భాగస్వామికి దీర్ఘ గాఢ
చుంబనం అందిం చారో గుర్తుకు తెచ్చు కోండి. తొలి రోజుల్లో మీ భాగస్వామికి ఎంత సన్నిహితంగా మెలిగేవారో గుర్తు చేసుకోండి. తరచూ అలా ముద్దుల వర్షం కురిపించడం ద్వారా మీ భాగస్వామి మీకు చాలా దగ్గర కాగ లరు. తరచూ మీ ముద్దు నైపుణ్యాలను మెరుగుపరచుకోండి. కొన్ని ప్రత్యేక సమ యాల్లో మీ భాగస్వామిని పైకి ఎత్తుకుని ముద్దాడటం కూడా చేయండి.
శృంగార సందేశాలు...
రోజుకో రీతిలో సెక్స్ సందేశాన్ని మీ భాగస్వామికి వినిపించడండి. ఆ సందేశం ఆ రోజు పూర్తిగా వారిని మీ ధ్యాసలోనే ఉంచగలదు. ఆ సందేశాలను భిన్న రూపాల్లో వ్యక్తం చేయడాన్ని అలవాటు చేసుకోండి.
గోరు ముద్దలు...
ఒకరికొకరు గోరు ముద్దలు తినిపించుకుంటే ఎంత ఆనందమో అనుభవిస్తే కానీ తెలియదు. అందులోనూ ఇద్దరూ నగ్నంగా ఉంటూ ఒకరికొకరు ఆ గోటి ముద్దలు తినిపించుకుంటే వారి మధ్య అనురాగం బాగా బలపడుతుంది. భాగస్వామికి ఇష్టమైన పదార్థాలను ఒకరికొకరు అలా తినిపించుకుంటే నిజంగా వారిలో లైంగిక బంధం బలపడేందుకు దోహదం చేస్తుంది.
మసాజ్ మహత్యం...
బాడీ మసాజ్ ద్వారా శరీర భాగాలను పరస్పరం మర్దనచేసుకోవడంతో వారిలో కామ వాంఛ రగల్చడంతో పాటు వెంటనే బాగా దగ్గర కావచ్చు. మర్దనలో ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు తెలుసుకుని, ప్రయోగిస్తూ ఉండాలి. తద్వారా భాగస్వామిలో గిలిగింతలు రేపవచ్చు.
శోభనం గుసగుసలు...
మీరు విన్న గొప్ప శోభనం కథలను రాత్రి పడుకునే సమయంలో మీ భాగస్వామికి వినిపించడం మరచిపోవద్దు. దీనికంటూ మీరు పలురకాలుగా ఆసక్తి కలిగించే కథలను సెక్స్ పదాలు ఉపయోగించి చెప్పడం ద్వారా వారిలో వాంఛను ప్రేరేపించ్చవచు.
శృంగార లేఖలు...
మీ భాగస్వామితో సెక్స్‌ను ఎంత చక్కగా ఎంజాయ్ చేశారో, ఇంకా ఏయే రీతిలో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో తెలిపేలా వారికి తరచూ లేఖలను లోతైన విశ్లేషణలతో రాయండి. వారినెంత గాఢంగా మీరు కోరుకుంటున్నారోనన్న విషయాన్ని అందులో పేర్కొనడం మరచిపోవద్దు.
నూతన భంగిమలు...
ఒకేరకమైన భంగిమలు కూడా సెక్స్ జీవితంపై విరక్తి కలిగించవచ్చు. అందుకని భంగిమలను తరచూ మార్చాలి. సెక్స్ భంగిమలకు సంబంధించి పలు పుస్తకాలు మార్కెట్లో దొరుకుతాయి. రెండు పుస్తకాలు కొని ఇద్దరూ ఒక్కో పుస్తకం చదవడం ద్వారా కొత్త విషయాలు తెలసుకుని మరింత ఆనందదాయకమైన సెక్స్ జీవితాన్ని అనుభవించవచ్చు. ఈ రతి క్రీడలను కొంతమేరకైనా మీ జీవితంలో పాటించినట్టయితే... మీ శృంగార జీవితం ధన్యమైనట్టే.
No comments:
Post a Comment