Saturday, October 30, 2010

పద్దెనిమిది కోట్ల హృదయాల చప్పుడు!

చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా ..గతమెంతో ఘనకీర్తి కలవోడా !

తెలుగు లలితకళాతోరణానికి రాజీవ్ పేరును జోడిస్తూ రాష్త్ర ప్రభుత్వం జారీచెసిన ఉత్తర్వులపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో ఆ ప్రతిపాదనను తెచ్చిన టి.సుబ్బరామి రెడ్డి తన ప్రయత్నాన్ని ఎట్టకేలకు విరమించుకోక తప్పలేదు. తెలుగు లలితకళాతోరణాన్ని యధాతధంగా ఉంచుతామని సుబ్బరామిరెడ్డి 30 నవంబరు 2010 వ తేదీ మధ్యాహ్నం టి.వి.9 చానెల్ ద్వారా ప్రకటించారు. తెలుగు జాతిలో వెల్లువెత్తిన ఆత్మాభిమానం తాకిడికి తట్టుకోలేకే ఈ దుష్ట యత్నాన్ని విరమించుకున్నారని భావించవచ్చు. " తెలుగు " అనే భావనే ఒక జాతినీ, భాషనూ సూచించే ఒక గొప్ప నామవాచకమైనప్పుడు తెలుగు కు ముందు మరొక పేరు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందనేది జాతిజనుల ప్రశ్న! బడి పిల్లలు తెలుగులో మాట్లాడినందుకు "నేనెప్పుడూ తెలుగులో మాట్లాడను" అనే ఆంగ్లంలో రాసిన అట్ట బోర్డులను  పసిపిల్లల మెడల్లో వేలాడదీసి శిక్షించిన సంఘటన జరిగిన సందర్భంలో చేష్టలుడిగి  చూసిన ప్రభుత్వం తెలుగు లలిత కళాతోరణం విషయంలో కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన దుర్గతిని మాత్రం ప్రజలు గమనిస్తున్నారని విస్మరించకూడదు. సుబ్బరామిరెడ్డి వెనుకడుగు వేసిన తర్వాతనైనా ప్రభుత్వం తాను జారీ చేసిన ఉత్తర్వులను తక్షణం విరమించుకుంటే బాగుంటుంది.    తెలుగు లలితకళాతోరణాన్ని 33 ఏళ్ళ లీజుకు తీసుకుని వ్యాపారం చేసుకుందామని ప్రయత్నించి దానికి పబ్లిక్, ప్రయివేట్, పార్ట్ నర్ షిప్ (పిపిపి) అనే అందమైన పేరును తగిలించారు.. వాట్ యాన్ అయిడియా సర్జీ! ..జనం అంటున్నారు..మాట్లాడ్డానికే కాదు..జాతి స్ఫూర్తికీ  " తెలుగు " అవసరమని..!       

Friday, October 29, 2010

kavita by Savira Snigdha

సరదా సరదా

నవ్వులు  –  పువ్వులు
చిన్ని :—  ఏరా  నువ్వు  మొత్తం   నీళ్లతో  తడిచే  ఉన్నావు! మరి  అమ్మ  ఎందుకు  స్నానం  చేయలేదని  నీపై   అరుస్తోందేమిటి?
బాబి :—  సబ్బు  తడపటం  మర్చిపోయాను!

చిన్ని ;—  బాబీ  ఎందుకలా  పరిగెత్తుకూంటూ  వెళుతున్నావు?
బాబి ;—   నాన్న   త్వరగా  కొట్తుకి వెళ్ళి  రమ్మన్నాడు.
చిన్ని ;—-  ఏం  కొనడనికి ?
బాబి ;—-  అడుగుతూ  కూర్చుంటే  ఆలస్యమవుతుందని,  త్వరగా  వెళ్లి  రావటానికి  పరిగెడుతున్నా.
మీరు  చెప్పండి
1)  కాళ్ళూ  చేతులు  లేవు,  మొడెం  ఉంది.  తల లేదు  మెడ ఉంది.  ఏమిటది?


2) ఓ చోట  మూడు  తెల్ల  ఆవులు,  రెండు  నల్ల  ఆవులు,  ఒక  ఎర్ర  ఆవు  ఉన్నాయి.  వీటల్లో  ఎన్ని  ఆవులు  నీ రంగు  నా రంగు  ఒకటే  అని  చెప్పగల

సరదా సరదా

Click to get cool Animations for your MySpace profile


నవ్వులు  –  పువ్వులు
:)     చిన్ని;-–    బాబి నువ్వెందుకురా ఆకాశంలో మెరుపు మెరసినప్పుడలా నవ్వుతూ ఉంటావు?
బాబి ;—-    అది నన్ను పోటో తీస్తుంది, దాంట్లో అందంగా రావాలని.
:)   చిన్ని ;–   బాబీ కాకతీయులపాలన ఎక్కడనుండి మొదలైయ్యిందో చెప్పు.
బాబి;--   సాంఘీకశాస్త్రం పుస్తకంలో 35 పేజీలో మొదలై   46 లో ముగిసిందక్కా.

:)   బాబీ ఓ రోజు వాళ్ళ స్కూలు కి ఫోన్ చేసి ఇలా చెప్పాడు. బాబీకి  కి చాలా జ్వరం వచ్చింది, ఈ రోజు బడికిరాడు”.  అవతల టీచర్  అయ్యో అవునా మీరెవరు మాట్లాడుతున్నారు అన్నాడు. అందుకు బాబీ నేను  మా అమ్మను మాట్లాడుతున్నాను టీచర్  అన్నాడు.

:) చిన్ని;— నాకు మన సైన్స్ టీచర్ అంటే ఇష్టం!  బాబీ  మనస్కూల్లో అందరికంటే ఎవరు నీకిష్టం?
బాబి;– నాకు మన స్కూల్  బెల్లు కొట్టే  పుల్లయ్య  ఇష్టం.
మీరు చెప్పండి
పార్క్ లో చిన్ని ఆడుకుంటూ ఉంది.   ఇంక చాలు ఇంటికొచ్చేమని అక్కడికి వాళ్ళ మామయ్య వచ్చాడు, “ఉహూ ఇంకోగంట ఆడుకుంటాను” అంది చిన్ని. ఐతే నా ప్రశ్నకు సమాధన మిస్తే నిన్ని ఇంకోగంట ఆడుకోనిస్తాను, లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోదాం అన్నాడు మామయ్య. అది ఆయన వయస్సు కనిపెట్టటానికై ఆతను ఇచ్చిన క్లూ.

ఇదిగో ఆ ప్రశ్న మీరు సమాధానం చెప్పగరేమో చూడండి –>
నాల్గేళ్ళ తరువాత నా వయస్సుకు నాల్గురెట్లు, అయిదేళ్ళతరువాత వయసుకు ఐదురెట్లు కలిపితే ప్రస్తుతం నా వయసుకు పదిరెట్లు ఉంటుంది. మరి నాకు ఎన్నేళ్ళో చెప్పాలి.

మరి చిన్ని కి మీరు సాయం చేయండి.
చిన్ని పుస్తకాల అలమార సర్దుకుంటోంది, దాంట్లో ఓ పాత పర్సు కనిపించింది.అందులో ఆరు నోట్లున్నాయి. వాటి మొత్తం విలువ 63 రూపాయలు. దాంట్లో రూపాయి నోట్లు లేవు, చిల్లర పైసలూ లేవు. ఆ ఆరు నోట్లు ఏవి? అంటే ఏవేవి కలిపితే మొత్తం 63 వస్తుంది?.

పులి నక్క కథ

పూర్వం ఒక అడవిలో ఒక  నక్క  నివసించేది.  అది పూర్వజన్మలో చేసిన పాపాల  కారణంగా  అలా నక్క లా  పుట్టింది.  ఈ  జన్మలో అటువంటి పాపాలు చేయకుడదని నిర్ణయించుకుంది. అది ఆ అడవిలోనే్ మంచినక్క.  మాంసం ముట్టుకోకుండా కేవలం ఆకులు అలములతో  శాకాహారంతోనే కాలం గడుపుతూ ఉండేది.
ఆ అడవిలోని  పులి ఆ నక్క గురించి  విని  దానితో  స్నేహం చేయాలనుకుంది. నక్క వద్దకు వెళ్ళి  స్నేహితులుగా  ఉందామని  చెప్పి  తనతో  రమ్మని  అడిగింది.  పులి కౄరమృగం  దానితో స్నేహం ఇష్టంలేక  నక్క అంగీకరించలేదు.  ’నీ స్నేహం  నాకు  ముఖ్యం. నీ పద్దతి ప్రకారమే నేనూ  నడచుకుంటా”  అంటూ పులి  బ్రతిమిలాడింది.  నక్క లాగే తనూ నియమంగా ఉంటానని  పులి  చెప్పడంతో  నక్క  ఆ పులితో కలిసి  జీవించడానికి  ఒప్పుకుంది.
పులికి నక్క చెప్పేమాటలు  చాలా నచ్చేవి. అది  చెప్పినట్టుగానే  నడచుకునేది.  వాటి స్నేహం,  నక్క చెప్పినట్లుగా  పులి  వినడం  అదంతా   పులితో  కలిసి వుండే   మిగతా జంతువులకి  నచ్చలేదు. ఎలాగైనా   నక్కను  పులిని విడగొట్టాలనుకున్నాయి.     ఓ పధకం ప్రకారం పులి తెచ్చుకుని  దాచుకున్న  ఆహారాన్నంతా  నక్కకు  తెలియకుండా  నక్క వద్ద  పెట్టి,  పులి వద్దకు  వెళ్ళి  నక్క   ఆహారాన్ని  దొంగిలించింది  అని  చెప్పాయి.
పులికి నక్క మంచితనం  తెలుసు. ఐనా కూడా  నక్కని   చంపివేయమని  చెప్పేస్తుంది. అది  తెలుసుకున్న నక్క  పులిని  విడిచి వెళ్ళిపోయింది.  చెప్పుడు మాటల వలన  పులి  మంచి స్నేహాన్ని కోల్పోయింది.
నీతి ;  చెడ్డవారితో స్నేహం ప్రమాదకరం.

నా ప్రియ నెచ్చెలీ

నీతో నేనుంటే అన్నీ రంగుల కలలే
నీ చిటికెన వేలూతతో నేను చూడలేని లోకాలన్నీ చుట్టేస్తాను 
నీ వెంట నడుస్తుంటే నాతొ నేను ఉన్నట్టే 
ఝరుల భావాల తుంపరలలో కలల తీరాల వెంట నీతో పరిగెడుతుంటే 
నాకు ఉచ్చ్వాస నిశ్వాసాలతో స్పృహే ఉండదేమిటో ??
జ్ఞాపకాల వీధుల్లో నాకు నచ్చే మజిలీకి నన్ను పొందికగా చేరుస్తావు 
నువ్వుంటే
నీ జంటే నాకుంటే
నా వెంట జలపాతాల జడివానలో తడిసిపోతుంటా
మరువాల మరుమల్లెల పరిమళంలో మునిగిపోతుంటా 
నువ్వు నేను కలిసుంటే లోకంతో నాకు పని లేదు ఏది ఏమయిపోయిన నాకు అక్కరలేదు 
నా ప్రియ నెచ్చెలీ !!! పుస్తకమా !!!
నన్ను నా నుంచి వేరు చేసి తీసుకెళ్ల గలిగేది నీవే సుమా !!!

Wednesday, October 27, 2010

మన కన్నీళ్ళే మనకు మరపురాని నేస్తాలు.


మనం ఎప్పుడూ ఒంటరి వాళ్లంకాదు దుక్కంలో , ఆనందంలో అందరికీ తోడుండేది ఆ కన్నీళ్ళే,
ఎందుకంటే నా కన్నీళ్లు నాకు తోడున్నాయి,నులలివెచ్చగా ఓదార్పుని ఇచ్చేవి ఆకన్నీళ్ళే
ఈ రోజే తెలుస్తోంది నాకు ,కన్నీళ్లు కూడా కమ్మగా ఉంటాయని ,
కన్నీళ్ళని మించిన చెలిమి లేదని,కన్నీళ్ళకేమీ సరిరావని.

సుఖాల్లోనే కాదు కష్టాలలో కూడా ,నేనున్నానంటూ ఆప్యాయం గా హత్తుకునే
కన్నీళ్లు ,నాకెప్పుడు దూరం కాకూడదు .కన్నీళ్ళన్నీ వచ్చిన ఆక్షనం మనస్సు ప్రశాతంగా ఉంటుంది

ఇది నేను కోల్పోతున్న ,నీ తీయని చెలిమి ఇస్తున్నకన్నీళ్ళు ఉప్పటి వరమేమో కదా .
లేక నా దురదృష్టం అని మాత్రం తొందరపడి డిసైడ్ కాకు ...అనేక ఆలోచనలతో వచ్చే ఆకన్నీళ్ళను ఆపకండి
కారే ఆకళ్ళీకు అడ్డు పడకండి...చివరివరకు మనకుతోడు నీడ అవే అనేవాస్తవాన్ని మరువకు
ఎవరు భాదపెట్టినా... ఆనందం ఎక్కువైనా నేనున్నానంటూ పలుకరించేవి ఆకన్నీళ్ళే కదా
కన్నీళ్ళు వచ్చేప్పుడు మరొకరు మీవద్ద లేకుండా ఓంటరిగా ఉండేందుకు ట్రై చేయండి..
లేదంటే కన్నీళ్ళు పెట్టుకొని మనస్సును ప్రశాతంగా చేసుకునే అవకాశాన్ని కోల్పోతాం
ఈ కన్నీళ్లపై ఇంకా ఏదో చెప్పాలని ఉంది కాని గతంతాలూక భాదలు గుర్తుకొస్తున్నాయి..
నాకన్నీళ్ళను ఎందుకు ఆపుకోవాలి అందుకే ఆ అవకాశాన్ని వదులుకోను..
ప్లీజ్..ప్లీజ్..ఒంటరిగా వదిలేయండి ఇప్పటికే అర్దం  అయిందనుకుంటా.

జీవితా! నీ మొగుడు రాజశేఖర్... చిరంజీవి కాదు...

జీవిత కు కలలో కూడా చిరంజీవి వస్తాడా ఏమిటి ఖర్మ..., జీవిత చిరంజీవి పై దాడి చేసే విధానం చూస్తుంటే జనం మదిలో లేనిపోని ఆలోచనలు పుడుతున్నాయి. జనాలకు నరసింహ సినిమా లో రమ్యకృష్ణ గుర్తువస్తోంది. ప్రజలు రాజశేఖర్ పై జాలి చూపడం మొదలెడతారేమో ఖర్మ... లేకపోతే లక్షల కోట్లు వెనకేసుకున్న జగన్ కు వకాల్తా పుచ్చుకుని చిరంజీవి బ్లడ్ బ్యాంకు ద్వారా ఏదో స్కాం చేసినట్లు మాట్లాడటమేమిటి చిత్రం. TV 9 ఛానల్ లో ఇంటర్వ్యూ లో చిరంజీవి స్కాం చేసేడా అని అడిగితే, నేను చిరంజీవి స్కాం చేసాడు అని అనట్లేదు అని చెప్పింది. చిరంజీవి సినిమా లలో మెగా స్టార్ అంటుంది, దాడి చేస్తుంది. ఈ రోజు ఇంటర్వ్యూ entertaining గా లేదు, ఎందుకంటే పక్కన జీవితా...జీవితా... అంటూ తనదైన యాసతో ప్రేక్షకులను  అలరించే రాజశేఖర్ లేనందువలన. ప్రేక్షకులకు ఈ జంట చేసే గోల బాగుంటుంది, కాని అది చిరంజీవి పై అన్న విషయం పై ఆసక్తి లేదు. కాకపోతే మొదట చెప్పుకున్నట్లు కొత్త కొత్త ఆలోచనలు వీక్షకులలో వస్తున్నాయి. పాపం రాజశేఖర్...
You might also like:

నీరెండ రంగుల్లో

పచ్చగా వున్నప్పుడు పట్టించుకోని
క్షణాలెన్నో
మనసుకింద పడి నలుగుతుంటాయి
నీరెండ రంగుల్లో పరిమళాలు చుట్టూ అల్లుకుంటుంటే
చూపెక్కడో అతుక్కుంటుంది
దృశ్యాలు దారం కట్టి లాగినట్టు
మెల్లిగా దూరంగా కదులుతుంటాయి
ఎవరెవరో మెదులుతూ... నవ్వుతూ...
మాట్లాడుతూ....
మళ్ళీ కధ మొదలయినట్టుగా!

జీవితమంతేనేమో..
మొదలయినట్టే ఆగిపోతుంది
ఆగిపోతూనే ఆరంభమవుతుంది
అందరిలో నుండి
అన్ని భయాల్లో నుండి
ఎదగడం నేర్పుకుపోతుంది

మధ్యాహ్నపు ఎండ,సాయంత్రపు గాలి,
రాత్రి చుక్కలు ఎప్పుడూ ఏదో ఒకటి
గుర్తుకు తెస్తూనే వుంటాయి
మనసు మెచ్చే క్షణాలెన్నెదురైనా,
అడుగు ఆగిపోయిన గతాలే ఎక్కువ!

సృజన (ఓ "miss"call ప్రేమకథ)

దుబాయి 18 -05 -2007 శుక్రవారం నేను ఎప్పటిలాగానే ఇంటర్నెట్ కేఫ్లో చాటింగ్ చేస్తూ కూర్చున్నాను. అంతలో నా మొబైలుకు ఒక misscall వచ్చింది. నంబర్ చెక్ చేశాను. అది ఐడియా మొబైల్ ఇండియా నంబరని అర్థమైంది. వెంటనే నంబర్ నుండి please call అని మెసేజ్ వచ్చింది. ఎవరబ్బా అని వెంటనే ఫోన్ చేశాను. అవతలి నుండి కోకిలా లాంటి స్వరం. ఆమె హలో అనగానే నాకు మతిపోయింది. ఎవరు మీరు అని అడిగాను. నాపేరు సృజన అనుకోకుండా నీకు మెసేజ్ వచ్చింది. ఐయము సారి అంది. నా నంబర్ నీకు ఎలా తెలుసని అడిగాను. (మొత్తం స్టొరీ త్వరలోనే  రాస్తాను.)

Friday, October 15, 2010

ఏ వైపు చూసిన

వైపు చూసినా నీ రూపే కనిపిస్తూవుంటే, నేను తీసుకునే ప్రతిశ్వాసకీ నీవే గుర్తొస్తుంటే, క్షణ క్షణం నా నీడలా నన్ను వెంటాడుతుంటే, ప్రతి రాత్రి కలగా వచ్చి నన్ను కవ్విస్తుంటే, ఏమి చేయను ప్రియతమా....!
మరపురాని నీ పరిచయం
మరవలేను క్షణం
కనులు మూస్తే నీ రూపం
కనిపిస్తుంది మరు క్షణం
కనులు తెరిస్తే ఎంతో దూరంలో వున్నావన్న నిజం
బాధ పెడుతుంది నన్ను ప్రతీ క్షణం

నీ అందం అనే వలలో
నేను చిక్కుకున్నా అర్దం కాని స్థితిలొ నేను వున్నా
ఎందుకే నీ అందంతో హింసిస్తున్నావు
నాలో విరహ వేదన
పెంచుతున్నావు

భూమి తిరగడం ఆగిపోవచ్చు
పక్షులు ఎగరడం ఆగిపోవచ్చు
కొవ్వొత్తి కరగడం ఆగిపోవచ్చు
చేపలు ఈదడం ఆగిపోవచ్చు
గుండె కొట్టుకోవడం ఆగిపోవచ్చు
కాని నేను నిన్ను మరవడం
అనేది మాత్రం జరగదు.
ఆమెతోనె నా ఏడు అడుగులు నా ఉహాల్లో


ఆమెను చూస్తే కంటికి వెలుగు రావాలి,ఊహలకు ఊపిరి కలగాలి,ఊపిరికి వేగం పెరగాలి,

ఆశల రెక్కలు విచ్చుకోవాలి,కలలకు ఆకారాం రావలి, నిముషం స్వర్గం అవ్వాలి,

తన వెన్నెల చూపుల వెలుగులకు యదలో అలికిడి కలగాలి,

తను నడిచొస్తుంటే హ్రుదయ తలుపుల్లో అలజడి రేగాలి,

తన కాలి అందెల సవ్వడికి ప్రక్రుతి పరవసించాలి,

తన మేని పరిమలాలు అత్తరులై ఆకాశాన్ని అంటాలి,

ఆమె స్పర్శతో గుండె లోతుల్లో పవనాలు వీచాలి,

తన కౌగిలితో కంటినీరు ఉప్పెనై ఉబకాలి,

గుండె గుడిలో తన రూపం శాశ్వితంగ నిలిచిపోవాలి,

తననవ్వులు జన్మ జన్మలకు పువ్వులై వర్షించాలి,

పెదవి అంచుల్లొ ప్రతిక్షణం పరితపించె నా పేరె వినపడాలి,

ఆమెతో వేసె 7 అడుగులు 7 జన్మలు గుర్తుకు రావాలి,

తన మాటల గలగల లతో నన్ను నేను మైమరచిపోవాలి,

మెల్లగ ఆమె అడుగుల్లొ అడుగు వెస్తు ప్రపంచాన్ని మరవాలి,

చిగురించె నా చిరు చిరు ఆశలు తన హ్రుదయంతో చిలకాలి,

నా చిటికెన వేలు పట్టుకోని పెళ్ళిబందానికి ప్రాణం పొయాలి,

ఆనందపు అందాలు,అల్లర్లు తన సౌందర్యమైన మోములో కనపడాలి,

విరహయాతనతో నోట మాట రాకుంటే కంటి బాషతో మనసు వెదనంతా తెలుసుకోవాలి,

ప్రతిరోజు ప్రెమికుల రోజు అయ్ ఇరువురి ఊపిరి గాలిలో ఏకమైపోవాలి..  సృజన! నీ ప్రేమకై పరితపించే నీ..... తిరు.

Thursday, October 7, 2010

శృంగార జోక్స్

ఒక సారి భీకర యుద్దం జరుగుతుంది.....
ఒక సైనికుడు శత్రుదేశానికి చెందినా ముగ్గురు స్త్రీలను బంధించడు...
" ఇప్పుడు మీ ముగ్గురిని రేప్ చేసి నా ప్రతికారం తీర్చుకుంటా..."
"పాపం ఆ ముసలావిడను వదిలెయ్యండి" అందులొ ఒక స్త్రీ దీనంగా అడిగింది....
"నొర్ముయ్.... యుద్దం అంటే యుద్దమే... మీరు రేప్ చేయండి అంది ముసలావిడ.

100 రుపాయలు

చింటు 5వ తరగతి చదువుతునప్పుడు ఒక రోజు...
ఛింటు :"టీచర్, పిల్లలకి కూడ పిల్లలవుతారా ?"
టీచర్ :"కారమ్మ.." అంది.
చింటు తన పక్కనున్న అమ్మయితొ "చూసావ నువ్వు అనవసరంగ భయపడుతున్నావ్" అన్నాడు.
**********************************************************************

ఒక సారి చింటు తన తండ్రికి వయాగ్రమందుని చాక్లెట్ లొ కలపి ఇస్తాడు...
చింటు :"డాడీ ఈ చాక్లెట్ రాత్రి పడుకునే ముందు తిను.. నచ్చితే నా బూక్స్ కింద 100 రుపాయిలు పెట్టు..."
తెల్లారి తన బుక్స్ కింద 1100 రుపాయిలు చూసి అశ్చర్య పొయాడు...
చింటు :"డాడీ నేను 100 రుపాలే పెట్టమన్నా కదా !"
డాడీ : " చింటు ఆ అందులో 100 రుపాయలు మత్రమే నావి.. మిగిత 1000 రుపాయలు పకింటి వనజ అంటివి."


బ్రా సర్వే


"అడవాళ్ళ బ్రా ఎలా వుంటే బాగుంటుంది" అని పురుషుల పై ఒక సర్వే జరిగింది....
2% మంది "తెల్లగా" వుంటే బావుంటుంది అన్నారు...
1% మంది "నల్లగా" వుంటే బావుంటుంది అన్నారు...
97% మంది "లెకుండా" వుంటే బావుంటుంది అన్నారు...





**********************************************dtk*******************







అల్లు అర్జున్ స్టెప్పులకు ప్లాట్ అయిన తమన్న

డేస్‌ ఎంజాయ్‌ చేస్తున్న తమన్నాకు టాలీవుడ్‌లో కన్నా కోలీవుడ్‌లో కావలసినంత గుర్తింపు వచ్చింది. లేటెస్ట్‌గా తెలుగులో అల్లు అర్జున్‌ హీరోగా రూపొందుతున్న 'బద్రీనాధ్‌' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఆ చిత్రంలో బన్నీ డ్యాన్సులకు ప్లాటయిపోయిందట తమన్నా. ఇలాంటి ఎనర్జిటిక్‌ హీరోను తాను అంతకుముందు ఎవరినీ చూడలేదని తెగ ఊదరగొట్టేస్తోంది. ఒక్కోసారి బన్నీ డ్యాన్సు అలా చూస్తూ ఉండిపోయే దాన్నంటూ చెప్పుకొచ్చింది. ఆయనతో పోటీపడి ఏ హీరోయిన్‌ కూడా అంత స్పీడ్‌గా డ్యాన్స్‌ చేయలేదని మళ్లీ తనకు 'బద్రీనాధ్‌' మంచి బ్రేక్‌ ఇస్తుందని అంటోంది. ప్రస్తుతానికి తమిళంలో బిజీబిజీగా మారిన తమన్నా తెలుగులో 'బద్రీనాద్‌' తోపాటు నాగచైతన్య చిత్రంలోనూ నటిస్తోంది. ఈ రెండు చిత్రాల ద్వారా మళ్లీ టాలీవుడ్‌ కోటలో పాగా వేద్దామని భావిస్తోంది తమన్నా. తమిళంలో హీరో సూర్య తమ్ముడు కార్తితో హిట్‌ కాంబినేషన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ జంట తమిళనాట క్రేజీ జంటగా పేరు తెచ్చుకున్నారు.   ******డి టి కుమార్****

ఎడారి బాదలు

ఎడారి కన్నీళ్ళు (టియర్స్‌ ఆఫ్‌ ద డెజర్ట్‌)
DT KUMAR October 2010
QATAR
అల్లంత దూరాన గుర్రాల కాలిగిట్టల చప్పుడు వినపడగానే గుండెల్లో వణుకు పుట్టి అది వెన్నుదాకా పాకుతుంటే ఎలా ఉంటుందో తెలుసా? నరరూప రాక్షసులు చుట్టుముడుతుంటే….
పసిమొగ్గల్ని ‘బలవంతంగా’ నలిపేస్తుంటే…
సర్వస్వాన్నీ తగలబెడుతుంటే… ఆ నరకం ఎలా ఉంటుందో తెలుసా?
మగాళ్లు మృగాలై ఒకరి తర్వాత ఒకరుగా… తనువంతా పచ్చిపుండవటం అంటే ఏమిటో తెలుసా?
ఉన్న ఊరినీ కన్న వారినీ కోల్పోయి పరాయిదేశంలో తలదాచుకోవడం ఎంత నరకంగా ఉంటుందో తెలుసా?
తెలుసుకోవాలనుకుంటే నా కథ చదవండి….
కన్ను మూస్తే నరకం.
కన్ను తెరిస్తే నరకం.
ఇదీ మా సూడాన్‌. ఇదే మా సూడాన్‌.
నా పేరు హలీమా బాషిర్‌. నేనొక డాక్టర్ని.
ఆఫ్రికా ఖండంలోనే పెద్ద దేశమైన సూడాన్లో… ఆడపిల్లకు చదువెందుకు అని ఆక్షేపించే ఒక మారుమూల గిరిజన తెగ మాది.
దార్ఫుర్‌ ప్రాంతంలోని ఆ తెగలో పుట్టిపెరిగిన నేను వైద్యురాలి నయ్యానంటే అందుకు కారణం మా నాన్న. ఒకప్పుడు తన ప్రాణాలు కాపాడిన వైద్యురాలు హలీమా పేరు నాకు పెట్టారాయన. చిన్నప్పటి నుంచీ చదువులో చురుగ్గా ఉండే నేను డాక్టర్నవ్వాలని కోరుకునేవాడు. ఆయన కలలు సాకారమయ్యాయి. ఇరవైనాలుగేళ్లవయసులో ఎన్నో ఊహలతో వైద్యపట్టా పుచ్చుకుని యూనివర్సిటీ నుంచి బయటి కొచ్చాను. కానీ నా ఊహలన్నీ ఊహలుగానే మిగిలిపోయాయి. కారణం… మా దేశంలో దశాబ్దాలుగా సాగుతున్న అంతర్యుద్ధం ముదిరి పోయింది. అప్పటికి కొత్తగా ఏర్పడిన ఇస్లామిక్‌ ప్రభుత్వానికీ స్థానికులకూ పొసగలేదు. ప్రభుత్వ పక్షపాతాన్ని సహించలేక తిరగబడ్డారు నల్లవారు. ముష్కరమూకల దండుతో సమాధానం చెప్పింది ప్రభుత్వం. ఒకవైపు స్థానిక నల్లజాతి తెగలు… మరోవైపు ముష్కరముఠాలు… ఒకరి చెలగాటం… మరొకరికి ప్రాణసంకటం. ప్రభుత్వం ఉసిగొల్పిన ఆ మూక పేరు… జంఝవీద్‌.
గుర్రాల మీద దుమ్ము రేపుకుంటూ ప్రవేశించే వారిలో ఒక్కొక్కడూ ఒక్కొక్క నరరూప రాక్షసుడు.
ఊళ్ళకు ఊళ్ళే  తగులబెట్టటం. మగవారిని కాల్చి చంపెయ్యడం.
చిన్నా పెద్దా తేడా లేదు… స్త్రీ అయితే చాలు క్రూరాతిక్రూరంగా వారిపై తమ పశుబలం ప్రదర్శించడం.
నా దేశంలో జరుగుతున్న మారణహోమం గురించి ఒక పాత్రికేయుడికి చెప్పానొకసారి.
మర్నాటి పేపర్లో ఆ వార్త చూసి ప్రభుత్వం కన్నెర్రజేసింది. నన్ను ఓ మారు మూల గ్రామానికి బదిలీ చేసింది.
ఆ రోజు నాకిప్పటికీ బాగా గుర్తు…. హాస్పిటల్లో ఉన్నాన్నేను. బయట ఏదో కలకలం.
బయటికొచ్చి చూస్తే…. ఎనిమిది నుంచి పదమూడేళ్లలోపు అమ్మాయిల్ని తీసుకొస్తున్నారు గ్రామస్థులు.
ఏమైందని అడిగాను. మానవజాతి సిగ్గుతో తలొంచుకునే విషయాలు చెప్పారు వారు.
వారంతా సమీపంలో ఉన్న పాఠశాల విద్యార్థినులు.
ఆ పసిమొగ్గల అందమైన భవిష్యత్తుకు పాఠాలతో బాటలు వేస్తున్న ఆ స్కూల్లోకి దూసుకొచ్చిందో జంఝవీద్‌ ముఠా. బలప్రయోగంతో తరగతిగదుల్లోకి ప్రవేశించారు కొందరు. ఇంకొందరు స్కూలు చుట్టూ కాపలా కాస్తున్నారు. లేళ్లగుంపుపై పడ్డ క్రూరమృగాల్లా పిల్లలపైనా టీచర్లపైనా పడ్డారు.
విషయం తెలిసి చుట్టుపక్కల ఉన్న తల్లిదండ్రులంతా స్కూలు దగ్గరికి పరుగులు తీశారు.
వారు లోపలికెళ్లకుండా అడ్డుకున్నారు కాపలా రాక్షసులు. తిరగబడిన వాళ్లని రైఫిల్‌ బట్‌ లతో అణిచేశారు. అయినా మాట విననివారిని కాల్చిపారేశారు. లోపల తమ పిల్లల జీవితాలు నాశనమైపోతుంటే నిస్సహాయంగా పొగిలిపొగిలి ఏడవటం తప్ప మరేం చేయలేక నిస్సహాయంగా కన్నీరుమున్నీ రయ్యారా తల్లిదండ్రులు.
ముష్కరమూకలు నిష్క్రమించాక తరగతిగదుల్లోకి పరుగులు తీశారు. తీవ్ర రక్తస్రావంతో షాక్‌తో వేలాడిపోతున్న పిల్లల్ని చేతుల్లో వేసుకుని పగిలిన గుండెల్తో పరిగెత్తుకుంటూ ఆస్పత్రికి తీసుకొచ్చారు.
నాకువైద్యవిద్యను బోధించిన ఏ ప్రొఫెసరూ చెప్పలేదు… రేప్‌ కు గురైన ఎనిమిదేళ్ల చిన్నారికి ఏ వైద్యం అందించాలో! ఎంత ఆలోచించినా గుర్తుకురాలేదు.. ‘ఏమైంది, నాకెందుకిలా జరిగింది’ అనే షాక్‌లో కూరుకుపోయిన చిన్నారులను మనలోకంలోకి తీసుకువచ్చేదెలాగో! నా కళ్ల వెంట నీళ్లు కారిపోతున్నాయా… ఏమో!
గుడ్లనీరు కుక్కుకుంటూనే కర్తవ్యం నిర్వర్తించాను.
ఈసారి ఈ దారుణం గురించి ఐక్యరాజ్యసమితి పరిశీలకులకు చెప్పాను. వారం గడిచిందో లేదో ముగ్గురు సైనికులు నా క్లినిక్‌కి వచ్చారు. ‘లే, నువ్వు మాతో వస్తున్నావు’ అంటూ నన్ను దౌర్జన్యంగా ఈడ్చుకెళ్లి జీపులో పడేసి దగ్గర్లో ఉన్న మిలటరీ క్యాంప్‌కి తీసుకెళ్లారు. నాకు అర్థమైపోయింది ఏం జరగబోతోందో!
జ    జ    జ
‘నీకు తెలుసా అసలు రేప్‌ అంటే ఏమిటో?’
కర్కశత్వానికి రూపం వస్తే వాడిలాగానే ఉంటుందేమో!
‘నువ్వు డాక్టరువి కాబట్టి నీకు తెలుసనుకుంటున్నావేమో’ ఇంకొక కర్కోటకుడి వెక్కిరింపు.
‘అందులో బాగా ఆరితేరిన మేం చూపిస్తాం నీకు, రేప్‌ అంటే ఏంటో’ మూడోవాడి ముక్తాయింపు.
నోట్లోగుడ్డలు కుక్కి సిగరెట్లు కాల్చి వాతలు పెడుతూ కత్తులతో ఒళ్లంతా గాట్లు పెడుతూ…
ఒకరి తర్వాత ఒకరుగా…
రెండురోజుల నరకమది.
క్షణమొక యుగం.
మూడోరోజు పొద్దున తలుపు తెరుచుకుంది.
‘అప్పుడు కాదు, ఇప్పుడు చెప్పు లోకానికి… రేప్‌ జరిగిందని. ఈ మాట అందరికీ చెప్పడానికే నిన్ను ప్రాణాలతో వదిలిపెడుతున్నాం’ అంటూ నన్ను తీసుకెళ్లి ఎడారిలో వదిలేశారు. నాకింకా భూమ్మీద నూకలు మిగిలే ఉన్నాయి. ఒంటెమీద అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి నా మీద దయతలిచాడు. తన ఒంటెమీద చోటిచ్చి మా ఊరికి చేర్చాడు. తడబడే అడుగులతో ఇంటికి చేరాను.
గుమ్మం దగ్గరే ఉంది అమ్మ. జీవచ్చవంలా నడిచొస్తున్న నన్ను నమ్మలేనట్టుగా చూసింది. మళ్లీమళ్లీ చూసింది. ఇంతలో లోపలినుంచి వచ్చాడు నాన్న. అప్పటిదాకా ఉగ్గబట్టుకున్న ఏడుపుని ఇంక ఆపుకోలేకపోయాను. భోరుమంటూ నాన్న భుజాల మీద వాలిపోయాను.
కాలం అన్ని గాయాల్నీ మాన్పుతుందంటారు. నిజమేనేమో, అమ్మానాన్నల ఓదార్పులో ఐదునెలలు గడిచాయి. ఊళ్లోనే ఉన్న క్లినిక్‌లో వైద్యం చేస్తున్నాను. లండన్‌లో ఉన్న బావ షరీఫ్‌తో అతని గైర్హాజరులోనే మా వివాహం జరిపించారు నాన్న. అంతకు ముందు నా జీవితంలో ఒకేఒక్కసారి కలిశాను షరీఫ్‌ని. అయినా మా తెగలో వరుణ్ని ఎంచుకునే స్వేచ్ఛ లేదు మాకు. కాలం అలా గడస్తుండగా….
మరోసారి మా ఊరిమీదికి విరుచుకుపడ్డాయి జంఝవీద్‌ మూకలు… గుర్రాల మీద…. వారికి తోడుగా సైనికులు… రాబందుల్లా హెలికాప్టర్ల మీదా… నాన్నకు విషయం అర్థమైంది. నావైపు తిరిగి… ‘పారిపో, అమ్మనీ చెల్లెళ్లనీ తమ్ముళ్లనీ తీసుకుని పారిపో’ అని గట్టిగా అరిచాడు.
అరుపులు పూర్తి కాకమునుపే రాకెట్‌ లాంచర్లు దూసుకొచ్చాయి. బాంబులు పేలాయి. నేను పరిగెడుతున్నాను. సర్వనాశనమైపోతోంది. చూస్తుండగానే ఊరుమొత్తం తగలబడిపోతోంది. దారిపొడుగునా క్షతగాత్రుల హృదయవిదారకమైన అరుపులు… ఒక్క క్షణం ఆగినా ప్రాణాలు దక్కని పరిస్థితి. పసిబిడ్డలను పొత్తిళ్లలో పట్టుకుని తల్లులు…. తమకన్నా చిన్న పిల్లల్ని గట్టిగా పట్టుకుని పెద్దపిల్లలూ అందరూ ఒకటే పరుగు. ప్రాణాలు దక్కించుకోవాలనే ఆరాటం.
ఊరుదాటి దూరంగా ఉన్న అడవిలోకి పరుగుతీశాం. హెలికాప్టర్లు వేటాడలేనంత లోపలికి దూరిపోయాం. ప్రాణాలరచేతబెట్టుకొని చప్పుడు చేయకుండా బిక్కుబిక్కుమంటూ ఒకచోట కూర్చున్నాం. దూరంగా గాలి అలల్లో తేలుతూ లీలగా వినపడుతోంది ఒకపాట… జంఝవీద్‌ ముఠాకి అత్యంత ఇష్టమైన పాట అది. వారి పెదాల వెంట ఎప్పుడూ వినిపించే పాట….
”చంపండి నల్లబానిసల్ని
చంపండి నల్లగాడిదల్ని
చంపండి నల్లకుక్కల్ని
చంపండి నల్లకోతుల్ని
ఒక్కరూ తప్పించుకోలేరు… అందర్నీ చంపేస్తాం”
పాటవింటున్న మా అందరిలోనూ విషాదం. దూరంగా గాల్లోకి పొగలు లేస్తూ కనిపించాయి. అది మా ఊరే. తెల్లారాక భయంభయంగా ఊళ్లోకి అడుగుపెట్టాం. అది మా ఊరేనా…? ఎటుచూసినా శవాలగుట్టలు. ఘోరకలి అది. ఏడవటానికి శక్తి కూడా లేదు.
నిస్సత్తువగానే… మృతదేహాల్ని బళ్లమీద వేసుకెళ్లి ఖననం చేశాం. రాత్రి పరుగులో అమ్మా తమ్ముళ్లూ ఎక్కడ తప్పిపోయారో తెలీదు. అసలున్నారో లేదో ఆచూకీ తెలియదు. నాన్న బతికున్నారో లేదో కూడా తెలీదు. నేనిప్పుడు ఒంటరిని.
ఈ ఒంటరిపక్షిపైనా రహస్యపోలీసులు ఓ కన్ను వేసే ఉంచారు. వాళ్ల అకృత్యాల గురించి రెండుసార్లు నోరెత్తింది నేనే మరి. నన్ను మళ్లీ నిర్బంధించాలన్న వారి నిర్ణయం గురించి ముందే తెలిసిపోయింది. ఊరివారందరూ కలిసి నన్ను అక్కణ్నుంచి తప్పించారు. ఎడారి దారుల్లో ప్రయాణించి క్యూబా చేరుకున్నాను. అది… దార్ఫుర్‌ నుంచి ప్రాణాలరచేత పెట్టుకుని పారిపోయి వచ్చే మాలాంటి శరణార్థులకు సురక్షిత ప్రదేశం. కానీ నాకు అక్కడా రక్షణ లేదు. మనుషుల్ని అక్రమంగా రవాణా చేసే ఒక ట్రాఫికర్ని పట్టుకున్నాను. నా దగ్గరున్న డబ్బూ అమ్మమ్మ నగలూ అన్నీ అతని చేతుల్లో పోసి ఎలాగైనా లండన్లో ఉన్న మా బావ షరీఫ్‌ దగ్గరకు చేర్చమన్నాను. క్షణక్షణగండంగా కొన్ని రోజులక్కడే గడిపాను. ఏర్పాట్లు పూర్తయ్యాయి. పుట్టినగడ్డని వదిలిపెట్టి పరాయిపంచకు చేరే సమయం ఆసన్నమైంది. మాతృభూమికి కన్నీటి వీడ్కోలు పలికాను. 2005లో లండన్‌కు చేరుకున్నాను. అష్టకష్టాలు పడి షరీఫ్‌ని కలుసుకోగలిగాను. బ్రిటన్‌ ప్రభుత్వం నా గాథను వింది. బాధను అర్థం చేసుకుంది. సాదరంగా ఆశ్రయమిచ్చింది. ఇక్కడే ఉంటూ సూడానీ మహిళల ప్రతినిధిగా నా గళాన్ని ప్రపంచానికి వినిపించాను. అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం నాడు (అప్పటి) అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్‌ని కలిసి మా దేశంలో జరుగుతున్న నరమేధం గురించి వివరించాను. సూడాన్‌ మహిళల ఆక్రందనలను వైట్‌ హౌస్‌లో ప్రతిధ్వనించగలిగాను. మాకు జరుగుతున్న అన్యాయాన్ని మరింత విస్తృతంగా ప్రపంచం దృష్టికి తేవడమే నా ముందున్న లక్ష్యం.
ఇప్పటికీ నాకు ప్రాణభయం ఉంది.
సూడానీ రహస్య ఏజెంట్లు నన్ను ఇప్పుడు ఇంకా ఎక్కువగా నీడలా వెంటాడుతున్నారు. వేటాడుతున్నారు. ఏ క్షణంలో నేనేమవుతనో నాకు తెలియదు. అందుకే…. యుద్ధాల కారణంగా అందరికన్నా ఎక్కువగా మహిళలూ పిల్లలే ఎలా నలిగిపోతున్నారో ప్రపంచానికి చాటిచెప్పాలంటే ఆ ఘోరకలిని అక్షరబద్ధం చేయడమే మంచిదని పించింది. అందుకు నా జీవితం కంటే పెద్ద ఉదాహరణ ఏముంది! అందుకే నా జీవితాన్నే పుస్తకంగా రాశాను. ఆ పుస్తకమే…. టియర్స్‌ ఆఫ్‌ ద డెజర్ట్‌. ఎడారి కన్నీళ్లు!
ఈ విశాల ప్రపంచం ఒక శరీరం అనుకుంటే… అందులో మా సూడాన్‌ ఓ రక్తమోడుతున్న గాయం. ఆ గాయం నయమవ్వాలి. ఆ బాధ అంతమవ్వాలి. అదే మా కోరిక.

Tuesday, October 5, 2010

ఈ పోటోలో ఉన్నది, ఎవరో తెలుసా?