Thursday, October 7, 2010

అల్లు అర్జున్ స్టెప్పులకు ప్లాట్ అయిన తమన్న

డేస్‌ ఎంజాయ్‌ చేస్తున్న తమన్నాకు టాలీవుడ్‌లో కన్నా కోలీవుడ్‌లో కావలసినంత గుర్తింపు వచ్చింది. లేటెస్ట్‌గా తెలుగులో అల్లు అర్జున్‌ హీరోగా రూపొందుతున్న 'బద్రీనాధ్‌' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఆ చిత్రంలో బన్నీ డ్యాన్సులకు ప్లాటయిపోయిందట తమన్నా. ఇలాంటి ఎనర్జిటిక్‌ హీరోను తాను అంతకుముందు ఎవరినీ చూడలేదని తెగ ఊదరగొట్టేస్తోంది. ఒక్కోసారి బన్నీ డ్యాన్సు అలా చూస్తూ ఉండిపోయే దాన్నంటూ చెప్పుకొచ్చింది. ఆయనతో పోటీపడి ఏ హీరోయిన్‌ కూడా అంత స్పీడ్‌గా డ్యాన్స్‌ చేయలేదని మళ్లీ తనకు 'బద్రీనాధ్‌' మంచి బ్రేక్‌ ఇస్తుందని అంటోంది. ప్రస్తుతానికి తమిళంలో బిజీబిజీగా మారిన తమన్నా తెలుగులో 'బద్రీనాద్‌' తోపాటు నాగచైతన్య చిత్రంలోనూ నటిస్తోంది. ఈ రెండు చిత్రాల ద్వారా మళ్లీ టాలీవుడ్‌ కోటలో పాగా వేద్దామని భావిస్తోంది తమన్నా. తమిళంలో హీరో సూర్య తమ్ముడు కార్తితో హిట్‌ కాంబినేషన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ జంట తమిళనాట క్రేజీ జంటగా పేరు తెచ్చుకున్నారు.   ******డి టి కుమార్****

No comments:

Post a Comment