జీవిత కు కలలో కూడా చిరంజీవి వస్తాడా ఏమిటి ఖర్మ..., జీవిత చిరంజీవి పై దాడి చేసే విధానం చూస్తుంటే జనం మదిలో లేనిపోని ఆలోచనలు పుడుతున్నాయి. జనాలకు నరసింహ సినిమా లో రమ్యకృష్ణ గుర్తువస్తోంది. ప్రజలు రాజశేఖర్ పై జాలి చూపడం మొదలెడతారేమో ఖర్మ... లేకపోతే లక్షల కోట్లు వెనకేసుకున్న జగన్ కు వకాల్తా పుచ్చుకుని చిరంజీవి బ్లడ్ బ్యాంకు ద్వారా ఏదో స్కాం చేసినట్లు మాట్లాడటమేమిటి చిత్రం. TV 9 ఛానల్ లో ఇంటర్వ్యూ లో చిరంజీవి స్కాం చేసేడా అని అడిగితే, నేను చిరంజీవి స్కాం చేసాడు అని అనట్లేదు అని చెప్పింది. చిరంజీవి సినిమా లలో మెగా స్టార్ అంటుంది, దాడి చేస్తుంది. ఈ రోజు ఇంటర్వ్యూ entertaining గా లేదు, ఎందుకంటే పక్కన జీవితా...జీవితా... అంటూ తనదైన యాసతో ప్రేక్షకులను అలరించే రాజశేఖర్ లేనందువలన. ప్రేక్షకులకు ఈ జంట చేసే గోల బాగుంటుంది, కాని అది చిరంజీవి పై అన్న విషయం పై ఆసక్తి లేదు. కాకపోతే మొదట చెప్పుకున్నట్లు కొత్త కొత్త ఆలోచనలు వీక్షకులలో వస్తున్నాయి. పాపం రాజశేఖర్...
You might also like:
No comments:
Post a Comment