ఏ వైపు చూసినా నీ రూపే కనిపిస్తూవుంటే, నేను తీసుకునే ప్రతిశ్వాసకీ నీవే గుర్తొస్తుంటే, క్షణ క్షణం నా నీడలా నన్ను వెంటాడుతుంటే, ప్రతి రాత్రి కలగా వచ్చి నన్ను కవ్విస్తుంటే, ఏమి చేయను ప్రియతమా....!
మరపురాని నీ పరిచయం
మరవలేను ఏ క్షణం
కనులు మూస్తే నీ రూపం
కనిపిస్తుంది మరు క్షణం
కనులు తెరిస్తే ఎంతో దూరంలో వున్నావన్న నిజం
బాధ పెడుతుంది నన్ను ప్రతీ క్షణం
నీ అందం అనే వలలో
నేను చిక్కుకున్నా అర్దం కాని స్థితిలొ నేను వున్నా
ఎందుకే నీ అందంతో హింసిస్తున్నావు
నాలో ఈ విరహ వేదన
పెంచుతున్నావు
భూమి తిరగడం ఆగిపోవచ్చు
పక్షులు ఎగరడం ఆగిపోవచ్చు
కొవ్వొత్తి కరగడం ఆగిపోవచ్చు
చేపలు ఈదడం ఆగిపోవచ్చు
గుండె కొట్టుకోవడం ఆగిపోవచ్చు
కాని నేను నిన్ను మరవడం
అనేది మాత్రం జరగదు.
No comments:
Post a Comment